మురుగదాస్ పై నో యాక్షన్.. కోర్టు ఆదేశాలు!

By Udayavani DhuliFirst Published Dec 13, 2018, 10:08 AM IST
Highlights

మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పలు సన్నివేశాలను అభ్యంతరకరంగా ఉన్నాయని మురుగాసాద్ పై కేసులు నమోదు చేశారు. 

మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పలు సన్నివేశాలను అభ్యంతరకరంగా ఉన్నాయని మురుగాసాద్ పై కేసులు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో మురుగదాస్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను విమర్శించారనే 
కారణంతో మురుగదాస్ పై కేసులు నమోదయ్యాయి. తనపై దాఖలైన కేసులను రద్దు చేయాలని కోరుతూ మురుగదాస్ హైకోర్టుని ఆశ్రయించారు. 

ఈ పిటిషన్ విచారణకి రాగా.. సీనియర్ న్యాయవాదులు హాజరవ్వడానికి గడువు ఇవ్వవలసిందిగా ప్రభుత్వం తరఫున కోరారు. దీంతో కేసుని రేపటికి (డిసంబర్ 14) వాయిదా వేశారు. అంతేకాదు మురుగదాస్ పై నమోదైన ఎఫ్ఐఆర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. 

విజయ్ హీరోగా నటించిన 'సర్కార్' సినిమాలో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లు ముఖ్య పాత్రలు పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ రోల్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఆమె పాత్రకు పెట్టిన కోమలవల్లి అనే పేరు మరిన్ని వివాదాలకు దారి తీసింది.  

click me!