Dj Tillu Success Trips: గుంటూరు లో డిజే టిల్లు హడావిడి... మోత మోగించేస్తున్నారు.

Published : Feb 15, 2022, 04:47 PM ISTUpdated : Feb 15, 2022, 04:48 PM IST
Dj Tillu Success Trips: గుంటూరు లో డిజే టిల్లు హడావిడి... మోత మోగించేస్తున్నారు.

సారాంశం

ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ మూవీగా ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది డిజే టిల్లు మూవీ. సక్సెస్ టూర్స్ తో జోష్ మీద ఉంది టీమ్.

సిద్దు జొన్నలగడ్డ, (siddhu Jonnalagadda) నేహశెట్టి(Neha Shetty) జంటగా.. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా డిజే టిల్లు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈమూవీకి కథ. స్క్రీన్ ప్లై హీరో సిద్దూనే అందించారు. ఈమూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించారు. ఈ సందర్భంగా సక్సెస్ టూర్స్ తో సందడి చేస్తున్నారు టీమ్.

రీసెంట్ గా రిలీజ్ అయిన డిజే టిల్లు మూవీ సక్సెస్ జోష్ లో ఉన్నారు. విజయోత్సవ యాత్రలకు బయలుదేరారుటీమ్. రీసెంట్ గా గుటూరు వెళ్ళిన టీమ్ అక్కడ ఓ థియేటర్ లో ప్రేక్షకులను కలుసుకున్నారు. వాళ్ళతో నవ్వుల్ని పంచుకుంటున్నారు. గుంటూరులో దిసినిమాస్ లో స‌డ‌న్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టిల్లును చూసి  కేరింత‌లు కొట్టారు ప్రేక్షకులు. థియేట‌ర్ లో  ప్రేక్ష‌కుల తో క‌ల‌సి చూసిన హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ నేహా శెట్టి, ద‌ర్శ‌కుడు విమ‌ల్ ఆడియ‌న్స్ మ‌ధ్య  కేక్ క‌ట్ చేసి స‌క్సెస్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు..

ఈ సందర్భంగా హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ(siddhu Jonnalagadda) .. డిజె టిల్లు స‌క్సెస్ మీతో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు చేసే అల్ల‌రి మీతో క‌ల‌సి చూడ‌టం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీన‌వ్వులు కామెంట్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను..రాధికాకు ఫుల్ స‌రెండ‌ర్ అయినా ఆమె ఎట్లా అంటే అట్లా అంటూ టిల్లు స్ట‌యిల్ లో మాట్లాడి ఆక‌ట్టుకున్నారు.

హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty)  మాట్లాడుతూ.. సినిమా మీకు న‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధిక క్యారెక్ట‌ర్ మీకు న‌చ్చిందా..? అంటూ ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూడ‌టం చాలా సంతోషంగా ఉంది.  మీ ఆద‌ర‌ణ‌కు చాలా రుణప‌డి ఉంటాను అన్నారు.

ఈ సందర్బంగా డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కూడా మాట్లాడారు. ఈసినిమాను ఇంత సక్సస్ చేసినందకు ఆడియ‌న్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్ట‌ర్ ఎంత‌గా న‌చ్చిందో మీ కేరింత‌లు చెబుతున్నాయి అంటూ ఆడియన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే