
ఈరోజు ఎపిసోడ్లో విక్రమ్ వాళ్ళ నాన్న నీ వల్లే నీ మాట వల్లే విక్రమ్ చదువుకోకుండా తయారయ్యాడు ఇప్పుడు నా మాట వినడం లేదు రాజ్యలక్ష్మి నీకు చేతులెత్తి మొక్కుతాను వారి జీవితాన్ని నాశనం చేయకు అనడంతో రాజ్యలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది. నిన్ను అంటూ కోపంతో రగిలిపోతూనే పక్షవాతం వచ్చి పడిపోతాడు. సీన్ కట్ చేస్తే విక్రమ్ తన తండ్రికి భోజనం తినిపించి టాబ్లెట్ కూడా వేస్తూ ఉంటాడు. గుడ్ బాయ్ ఈరోజు చాలా ముద్దొస్తున్నావు ప్రతిరోజు ఇలాగే తినాలి అనడంతో నువ్వే ప్రతిరోజు తినిపిస్తే ఇలాగే ఉంటాను నాన్న అని మనసులో అనుకుంటూ ఉంటాడు.
గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు నువ్వు మీ అమ్మని నమ్ముతున్నావు అనుకుంటూ ఉండగా రోజు నిన్ను దగ్గరుండి చూసుకోవాలని ఉంది కానీ టైం కుదరడం లేదు అని అంటాడు విక్రమ్. టైం కాదు నాన్న ఆ రాక్షసి నిన్ను నా రూమ్ కి రాకుండా మన మధ్య ప్రేమ అనురాగాలు చిగురించకుండా ఏదో ఒక పని చెప్పి నేను రానివ్వకుండా చేస్తుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి మంచిది అనుకొని ఆమె గురించి పొగుడుతూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు విక్రమ్ వాళ్ళ నాన్న లోలోపల బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు నందు లాస్య తులసి ఒకచోట నిలబడి ఉండగా ఇంతలో అక్కడికి దివ్య వస్తుంది.
అప్పుడు ఇబ్బంది పడుతూ దివ్య పైట సర్దుతూ ఉండగా ఏదో చెప్పాలనుకుంటుంది అందుకే ఇబ్బంది పడుతోంది అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ కొన్ని మంచి నీళ్లు తీసుకుని వస్తావా అనగా అ తులసి మంచినీళ్లు తీసుకుని రావడంతో అప్పుడు తులసి మాట్లాడడానికి ప్రయత్నించగా మళ్లీ నా సెతస్కోప్ కనిపించలేదమ్మా అని అనగా తులసి వెతకడానికి వెళ్తుంది. అప్పుడు పక్కనే ఉన్న నందు లాస్య దివ్య కావాలనే ఇదంతా చేస్తోంది అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే తులసి ఆ సెతస్కోప్ కనిపించలేదు అనగా అప్పుడు దివ్య మర్చిపోయానమ్మా నా బ్యాగ్ లోనే ఉంది అని అంటుంది. అప్పుడు తులసి మాట్లాడండి ప్రయత్నించగా క్యారీలో ఏం పెట్టినావమ్మా అవునా సరే నేను వెళ్ళొస్తాను అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు లాస్య కావాలనే దివ్యని అవాయిడ్ చేస్తుంది కదా, రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడితే ఏమవుతుంది అని అనగా తులసి ప్రయత్నం చేసింది కదా అని నందు అనడంతో మహానుభావా నేను మీ తులసిని ఏమీ అనలేదు అని అంటుంది లాస్య. తులసి హాస్పిటల్ నుంచి వచ్చాక మళ్ళీ ట్రై చెయ్ అని అంటాడు నందు. మరొకవైపు సంజు హాస్పటల్లోని అమ్మాయితో కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఇంతలోనే అక్కడికి విక్రమ్ వస్తాడు. అప్పుడు విక్రమ్ ని చూసిన సంజయ్ అమ్మాయిని తిడుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ అమ్మ ఎక్కడ ఉంది అనడంతో మీటింగ్ హాల్లో ఉంది అని చెబుతాడు సంజయ్.
అప్పుడు సంజయ్ వైపు చూసి ఎవరి అమ్మాయి అని సైగలు చేయగా మామ్ కి చెప్తే నా పని అంతే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ సంజయ్ మాటలు నిజం అని నమ్మి ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి క్లాస్ పీకడం మొదలుపెట్టావో అక్కడే మొదలుపెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విక్రమ్ అక్కడి నుంచి వెళుతుండగా దివ్యనీ సరిగా ఆగిపోయి దివ్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. థాంక్యూ దేవుడా అందమైన అమ్మాయిని ఇచ్చావు ఆ అమ్మాయిని మా హాస్పిటల్ కి వచ్చేలా చేసావు. ఆ తర్వాత కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యేలా చూడు స్వామి అని మనసులో అనుకుంటూ ఉంటాడు విక్రమ్.
ఇంతలోనే ఒక బాబుకి యాక్సిడెంట్ అయ్యింది అని ఒక అమ్మ పరిగెత్తుకుని రావడంతో అప్పుడు దివ్య బాబుని చెక్ చేస్తూ ఉండగా అప్పుడు విక్రమ్ దివ్య వైపు అలాగే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు బాబుని ఐసియూ లోకి తీసుకొని వెళుతుండగా అప్పుడు విక్రమ్ కూడా లోపలికి వెళ్తుండడంతో హే మిస్టర్ ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు బయటికి వెళ్ళు అని అంటుంది. హాస్పిటల్ నర్స్ విక్రమ్ ఎవరో చెప్పబోతుండగా చెప్పొద్దు అని సైగలు చేస్తాడు. అప్పుడు దివ్య విక్రమ్ తన చేతులతో వెనక్కి నెట్టేయడంతో విక్రమ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తూ ఉండగా విక్రమ్ అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత దివ్య బయటకు వచ్చి ఆ బాబు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది.
బాబుకి యాక్సిడెంట్ అయిన వాళ్ళని అడిగి డబ్బులు ఇప్పించుకోవాలి కదా అనగా నాతో పాటు రండమ్మా మీరే డబ్బులు ఇప్పించండి అని అని పిలుచుకుని వెళ్లి అదిగో అమ్మ అతనే అనడంతో దివ్య, విక్రమ్ యాక్సిడెంట్ చేశాడు అని అనుకుంటూ ఉంటుంది. విక్రమ్ వెనకాల ఉన్న అతను యాక్షన్ చేయడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య అక్కడికి వెళ్లి విక్రమ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ దివ్య వైపు చూస్తూ ఉండగా అప్పుడు దివ్య యాక్సిడెంట్ చేసి ధైర్యంగా ఇక్కడ నిలబడినావు. ఇంత ధైర్యం నీకు అని అంటుంది. ఆక్సిడెంట్ చేసావు నీకు భయం లేదా అనగా భయం ఉంటే ఏది దక్కించుకోలేమని మా దేవుడు చెప్పాడు అని అంటాడు విక్రమ్.
యాక్సిడెంట్ అయిన డబ్బులు ఇస్తావా లేకుంటే గొడవ చేయమంటావా అనగా ఇందులో వచ్చి విక్రమ్ ఎవరో చెప్పబోతుండగా మేము మేము చూసుకుంటాం కదా మధ్యలో నీకెందుకు నువ్వు వెళ్ళు అని అంటాడు విక్రమ్. అప్పుడు దివ్య ఇది నా అడ్డా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని పారిపోలేవు డబ్బులు ఇవ్వు అని అనడంతో విక్రం తన జోబులో ఉన్న డబ్బులు తీసి దివ్య చేతిలో పెడతాడు. డబ్బులు కరెక్ట్ గానే ఉన్నాయా అనడంతో కావాలంటే మీ ముందే నిలబడతాను డబ్బులు పెంచుకోండి అనగా వద్దులే అని అంటుంది దివ్య. అప్పుడు దివ్య ఫోన్ నెంబర్ చెప్పు అనగా విక్రమ్ సిగ్గుపడుతూ ఉండగా వెంటనే దివ్య విక్రమ్ జోబులో ఉన్న ఫోన్ తీసుకొని ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. ఫోన్ నెంబర్ తీసుకున్నాను నేను ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు వచ్చి ఆ బాబుకి డబ్బులు అవసరం అయితే ఇవ్వు అనడంతో అంతకంటే మహాభాగ్యమా నేను మేము ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని విక్రమ్ నవ్వుకుంటూ ఉంటాడు.
సరే వెళ్ళు అనగా విక్రమ్ మొబైల్ వైపు చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత దివ్య డబ్బులు తీసుకుని వెళ్లి ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఇంకా డబ్బులు కావాలంటే నేను అతని నుంచి అడిగి ఇప్పిస్తాను అనడంతో ఈ డబ్బులు నాకు ఎందుకు అమ్మ అసలు ఆక్సిడెంట్ చేసింది అతను కాదు అనడంతో దివ్య ఆశ్చర్యపోతుంది. మరి ఇంకెవరు అనడంతో అతని వెనకాల ఉన్న అతను మేడం మీరు అతనితో పరిచయం ఉందేమో అని నేను వచ్చి అడ్డుపడలేదు అనడంతో ఎంత తప్పు జరిగింది అని అనుకుంటూ ఉంటుంది దివ్య. డబ్బు ఎలా ఇచ్చాడు మేడం అనడంతో అవును ఎలా ఇచ్చాడు రెండు లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు అనుకుంటూ ఉంటుంది దివ్య. తర్వాత విక్రమ్ కోసం బయటికి వెళ్లి వెతుకుతూ ఉంటుంది దివ్య. తర్వాత దివ్య ఫోన్ చేసినా కూడా విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దివ్య ఎలా అయినా నేను ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది.