పొలిటీషియన్ తో హీరోయిన్ ఎఫైర్.. హీరోని వదిలేసిందా!

Published : Jun 13, 2019, 07:48 PM IST
పొలిటీషియన్ తో హీరోయిన్ ఎఫైర్.. హీరోని వదిలేసిందా!

సారాంశం

తెలుగులో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. ఆ చిత్రం నిరాశపరచడంతో అవకాశాల కోసం బాలీవుడ్ కు వెళ్ళింది. దిశా పటని బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 

తెలుగులో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. ఆ చిత్రం నిరాశపరచడంతో అవకాశాల కోసం బాలీవుడ్ కు వెళ్ళింది. దిశా పటని బాలీవుడ్ కు వెళ్లినప్పటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ప్రేమ వ్యవహారాలు, అందాల ఆరబోసేలా ఉండే ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో దిశా పటాని ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఆమె చేసే ఫోటో షూట్స్ వల్ల ట్రోలింగ్ ని కూడా ఎదుర్కొంటోంది. 

దిశా పటాని, స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. కానీ వీరిద్దరూ తామిద్దరం స్నేహితులం మత్రమే అంటూ తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా దిశా పటాని ఓ యంగ్ పొలిటీషియన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల దిశా పటాని, బాల్ థాక్రే మనవడు ఆదిత్య థాక్రే కలసి డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

దీనితో దిశా పటాని, టైగర్ ష్రాఫ్ విడిపోయారు అంటూ బాలీవుడ్ లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా దిశా పటాని స్పందించింది. నాకు ఆదిత్య మంచి స్నేహితుడు. ఇందులో ఇంకేమి లేదు. తెలియకుండా నాపై విమర్శలు చేసే వారిగురించి నేను పట్టించుకోను అని దిశా పటాని తేల్చి చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?
ఎన్టీఆర్ , ఎస్వీఆర్ మధ్య చిచ్చుపెట్టిన డైలాగ్ ఏదో తెలుసా? 3 ఏళ్లు ఇద్దరి మధ్య మాటలు ఎందుకు లేవు?