నా కూతురిపై తప్పుడు పుకార్లు క్రియేట్‌ చేస్తున్నారు..దిశా తండ్రి ఫిర్యాదు

Published : Aug 14, 2020, 02:19 PM IST
నా కూతురిపై తప్పుడు పుకార్లు క్రియేట్‌ చేస్తున్నారు..దిశా తండ్రి ఫిర్యాదు

సారాంశం

తన కూతురు మరణానికి సంబంధించి తప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారని దిశా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ముగ్గురు వ్యక్తులపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకుగానూ ముగ్గరు వ్యక్తులపై ఆయన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియన్‌ మృతి కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఆమెది కూడా ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీ నాయకులు దిశాది ఆత్మహత్య కాదు, ఆమెని హత్య చేశారని ఆరోపించారు. దిశా స్నేహితురాలు ఆమె అపార్ట్ మెంట్‌పై దూకిందని మరో వాదన చెప్పింది. దీంతో ముంబయి పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకి, దిశా ఆత్మహత్యకి ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా తన కూతురు మరణానికి సంబంధించి తప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారని దిశా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ముగ్గురు వ్యక్తులపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిశా మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకుగానూ ముగ్గరు వ్యక్తులపై ఆయన శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కొంత మంది సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని, దిశా మరణంతో కలిపి వాట్సాప్‌ ఫార్వర్డ్ మెసేజ్‌లు చేస్తున్నారని, సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, సుశాంత్‌ మరణానికి, దిశా మరణానికి సంబంధం ఉందని ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పునీత్‌ విశిష్ట, సందీప్‌ మలాని, నమన్‌ శర్మలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు తప్పుడు పుకార్లు క్రియేట్‌ చేశారని దిశా తండ్రి సతీష్‌ సలియన్‌ ముంబయిలోని మల్వాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారి తప్పుడు పోస్టులు తమని ఎంతగా వేధిస్తున్నాయో తెలిపారు. 

ఈ కేసుని మల్వాని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని, అనంతరం వారిని విచారిస్తామని తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది