ఈ వారం 15 సినిమాలు రిలీజ్...షాకింగ్ రిజల్ట్

Published : Dec 12, 2022, 07:33 PM IST
ఈ వారం 15 సినిమాలు రిలీజ్...షాకింగ్ రిజల్ట్

సారాంశం

 ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15కు పైగా చిత్రాలను డిసెంబరు 9న తమ సినిమాను విడుదల చేసారు. 


 2022 ముగింపునకు వచ్చేసింది. పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కు లేవు. దాంతో  కోవిడ్ నుంచి ఉగ్గపెట్టుకుని ఎప్పుడు రిలీజ్ అని ఎదురుచూస్తూ అవకాసం రాని సినిమాలు అన్ని  బాక్సాఫీస్‌ వద్ద క్యూ కట్టాయి. ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15కు పైగా చిత్రాలను డిసెంబరు 9న తమ సినిమాను విడుదల చేసారు. అయితే ఏ సినిమాకు మినిమం ఓపినింగ్స్ కూడా రాకపోవటం దురదృష్టం. గత వారం రిలీజైన హిట్ 2 నే జనం ఇంకా చూస్తున్నారు తప్పించి, ఈ కొత్త సినిమాలను పట్టించుకున్న వాళ్ళు కనపడటం లేదు. ఈ సినిమాల్లో కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, పంచతంత్రం.  

ఈ సినిమాలు రిలిజ్ కు ముందు ఏదొ కొత్త తరహా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయని అని అందరూ అనుకున్నారు.  ట్రెండ్​కు తగ్గట్టు ఫాలో అవ్వడమే కాకుండా ట్రెండ్​ను సెట్​ చేసేలా ఉన్నాయి ఈ  సినిమాలు అనుకున్నారు. కానీ ఈ సినిమాల్లో ఏమీ కూడా వర్కవుట్ కాలేదు.   డిఫరెంట్​ కాన్సెప్ట్స్​తో తెరకెక్కిన చిత్రాలు ఈ చిత్రాలు సినిమాలో సరైన విషయం, స్క్రీన్ ప్లే లేక భాక్సాఫీస్ దగ్గర చిన్న చప్పుడు కూడా చెయ్యలేకపోయాయి.

వికాస్ వశిష్ఠ - ప్రియా వడ్లమాని జంటగా 'ముఖ చిత్రం సినిమా రూపొందింది. సందీప్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి గంగాధర్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. సునీల్ కీలకమైన పాత్రను .. విష్వక్ సేన్ ప్రత్యేకమైన పాత్రను పోషించగా, ఇతర పాత్రల్లో రవిశంకర్ .. చైతన్యరావు కనిపించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

రెగ్యులర్ కథలకు బిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పంచతంత్రం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐదు విభిన్నమైన కథల సమాహారంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అప్పట్లో `చందమామకథలు` రాగా.. ఇప్పుడు పంచతంత్రం సినిమా వచ్చి తెలుగు ప్రేక్షకులకు ఓ వైవిధ్యమైన అనుభూతి కలిగించే ప్రయత్నం చేసింది. హర్ష పులిపాక దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే పెద్దగా లేదనే చెప్పాలి.  

ఇక సత్యదేవ్ ప్రస్తుతం తనకి గల క్రేజ్ కి భిన్నంగా ఒక లవ్ స్టోరీ చేశాడు. ఆ సినిమా పేరే 'గుర్తుందా శీతాకాలం'.  సత్యదేవ్ తో పాటు ట్రావెల్ అయ్యే పాత్రలలో తమన్నా .. మేఘ ఆకాశ్ .. కావ్య శెట్టి కనిపిస్తారు. భావన రవి .. రామారావు నిర్మించిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాని కూడా జనాలు తిప్పి కొట్టారు.

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే