హిట్ ఇచ్చినా వంశీ పైడిపల్లి కు ఆ సమస్య తీరటం లేదు?

Siva Kodati |  
Published : May 18, 2019, 03:39 PM IST
హిట్ ఇచ్చినా వంశీ పైడిపల్లి కు ఆ సమస్య తీరటం లేదు?

సారాంశం

ఇండస్ట్రీలో ఓ చిత్రమైన సమస్య ఉంది. స్టార్ డైరక్టర్స్ కు హీరోలు దొరకరు. వాళ్ల డేట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చెయ్యాల్సిందే. రంగస్దలం వంటి సూపర్ హిట్ ఇచ్చినా సుకుమార్ ది అదే పరిస్దితి. 

ఇండస్ట్రీలో ఓ చిత్రమైన సమస్య ఉంది. స్టార్ డైరక్టర్స్ కు హీరోలు దొరకరు. వాళ్ల డేట్స్ కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చెయ్యాల్సిందే. రంగస్దలం వంటి సూపర్ హిట్ ఇచ్చినా సుకుమార్ ది అదే పరిస్దితి. ఆయనకు బన్ని డేట్స్ కోసం వెయిట్ చేస్తు స్క్రిప్టు రాసుకుంటున్నారు. రంగస్దలం రిలీజ్ ఇంతకాలం అయినా నెక్ట్స్ సినిమా ఇంకా మొదలు కాదు. ఇప్పుడు అదే పరిస్దితి వంశీ పైడిపల్లి సైతం ఎదుర్కొబోతున్నారని వినపడుతోంది.

మహేష్ తో మహర్షి వంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి వెంటనే సినిమా చేయటానికి స్క్రిప్టు ఉన్నా హీరో లేరట. ఆయనతో చేయటానికి హీరోలు ఉత్సాహం చూపెడుతున్నా..వారు ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు ఫినిష్ చేసి వంశీ దగ్గరకు రావాల్సి ఉంటుంది. దానికి తోడు ఒక్కో హీరో ..ఒక్కో సినిమా కోసం  దాదాపు ఆరేడు నెలలు ఖర్చు పెడుతూండటంతో సంవత్సరానికి రెండు సినిమాలు కూడా చెయ్యలేకపోతున్నారు. ఓ ప్రక్క కొరటాల శివ సైతం అదే పరిస్దితి ఎదుర్కొంటున్నారు. 

ఇక వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని మెగా హీరో రామ్ చరణ్ తో చేద్దామనే ఆలోచనలో ఉన్నారట.  రామ్ చరణ్ సైతం వంశీ తో చేయటానికి ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. కానీ ఆయన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైతే కానీ మరో సినిమా కమిటవ్వటానికి లేదు. ఈ నేపధ్యంలో చెర్రీతోనే సినిమా చెయ్యాలంటే వంశీ అలా ఐడిలా ఉండి వెయిట్ చెయ్యాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా