సినిమాను కెలికేస్తోన్న దేవరకొండ.. డైరెక్టర్ అలక!

Published : Jun 20, 2019, 11:16 AM IST
సినిమాను కెలికేస్తోన్న దేవరకొండ.. డైరెక్టర్ అలక!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడి పనిలో ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడి పనిలో ఇన్వాల్వ్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సినిమా వరకు దర్శకుడికి వదిలేసి, మార్కెటింగ్ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అయ్యే విజయ్ దేవరకొండ ఇప్పుడు దర్శకుల పనిలోనూ వేలు పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

'గీత గోవిందం' సినిమా తరువాత విజయ్ క్రేజ్ పెరిగిన సంగతి సంగతి తెలిసిందే. అందుకే సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పెరిగిపోయి దర్శకుడు చేయాల్సిన పని కూడా తనే చేస్తున్నాడట. కొత్త దర్శకుడు భరత్ కమ్మ.. విజయ్ హీరోగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఏ సీన్ ఉంచాలి..? ఏది తీసేయాలనే విషయాన్ని దేవరకొండ డిసైడ్ చేస్తున్నాడట. విజయ్ మీద నమ్మకంతో నిర్మాతలు కూడా అతడిని ఏమీ అనడం లేదట. దీంతో కొత్త దర్శకుడు భరత్ కమ్మ బాగా విసిగిపోయాడట. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు దూరంగా ఉంటున్నాడట. 

డైరెక్టర్ అలిగాడని విజయ్ కి అర్ధమైనా.. అదేమీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటున్నాడట. అంతేకాదు.. ఈరోజు ఇంతవరకు పనిచేశామని డైరెక్టర్ కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడట. హీరోగా మారి కొంతకాలం కాకముందే విజయ్ ఈ రేంజ్ లో సినిమాను కెలికేస్తుండడం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?