ప్రముఖ తమిళ దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ (Sudha Kongara) తాజాగా గాయపడింది. చేతికి తీవ్రమైన గాయమైనట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. చికిత్స చేయించుకున్న ఫొటోలను కూడా పంచుకుంది.
తమిళ దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సూర్య సైతం కామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక హిందీ రీమేక్ ను కూడా డైరెక్టర్ సుధా కొంగరనే తెరకెక్కిస్తుండటం విశేషం. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
గతేడాదే షూటింగ్ ప్రారంభమై రెగ్యులర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజా షెడ్యూల్ లో సుధా కొంగర గాయపడింది. దీంతో ఆమె ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే చికిత్స కూడా తీసుకుంది. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక నెల పాటు షూటింగ్ కు, ఇతర పనులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం డాక్టర్లు సుధాకు రెస్ట్ సజెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సుధా కొంగరనే స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా తన చేతికి కట్టుకట్టిన ఫొటోలను పంచుకుంది. షూటింగ్ కొననసాగుతున్న సమయంలో ఇలా కావడం బాధాకరంగా ఉందని, చాలా బాధగానూ ఉందని పేర్కొన్నారు.
విభిన్నమైన కథలతో సుధా కొంగర ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. టాలెంటెడ్ అండ్ లేడీ డైరెక్టర్ గా హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
సూర్య 2D ఎంటర్‌టైన్‌మెంట్, అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ‘సూరారైపొట్రు’ ఎంతటి రెస్పాన్స్ ను దక్కించుకుందో తెలిసిందే. దీనికి హిందీ వెర్షన్ లోనే అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. గతేడాది ఇది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వచ్చింది. రాధిక మదన్ కథానాయికగా అక్షయ్ కుమార్ సరసన నటిస్తోంది. పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు.