'యాత్ర' సినిమాపై దర్శకేంద్రుడి కామెంట్స్!

Published : Feb 13, 2019, 09:48 AM IST
'యాత్ర' సినిమాపై దర్శకేంద్రుడి కామెంట్స్!

సారాంశం

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు మహి వి రాఘవ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమా చూసి చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా స్పందించిన ఆయన.. ''యాత్ర చూశాను. దర్శకుడు మహి, రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో పాటు ఆయన ఆశయాల్ని కూడా అధ్బుతంగా  తెరకెక్కించారు. మమ్ముట్టి ఆయన పాత్రలో జీవించారు. నిర్మాతలు విజయ్ మరియు శశికి, వారి చిత్రయూనిట్ కి నా కృతజ్ఞతలు'' అంటూ రాసుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ