కరోనా విషాదంః దర్శకుడు, నటుడు ఆర్‌ పార్థిపన్‌కి పితృవియోగం

By Aithagoni RajuFirst Published Jun 2, 2021, 10:22 AM IST
Highlights

కరోనా చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదాన్ని నింపింది. ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్‌ పార్థిపన్‌ కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వి దేశింగ్‌(80) కరోనా కారణంగా ఆయన కన్నుమూశారు. 

కరోనా చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదాన్ని నింపింది. ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్‌ పార్థిపన్‌ కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వి దేశింగ్‌(80) కరోనా కారణంగా ఆయన కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి ఆయన కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా లక్షణాలుండటంతో చికిత్స తీసుకున్నారు. అయితే ఆక్సిజన్‌ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు గత నెల 23న పాండిచ్చేరిలోని ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది రోజులుగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా ఆయన సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

ఆర్‌ పార్థిపన్‌ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, రైటర్‌గా రాణిస్తున్నారు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిభని చాటుతున్నారు. `పుథియ పాదై`, `హౌజ్‌ఫుల్‌`, `ఓతా సెరుప్పు సైజ్‌ 7` వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా 14 సినిమాలను రూపొందించారు. తన సినిమాలన్నింటికీ ఆయనే నిర్మాత. ఇక నటుడిగా అనేక చిత్రాల్లో నటించారు. నటిస్తున్నారు.అంతేకాదు ఆయన సింగర్‌ కూడా. లిరిక్‌రైటర్‌గానూ వర్క్ చేశారు. తెలుగు, తమిళంలో మదర్‌ క్యారెక్టర్స్ చేస్తున్న సీత మాజీ భర్త పార్థిపన్‌. 2001లో వీరు విడాకులు తీసుకున్నారు.
 

click me!