పూరి జగన్నాధ్ ఛస్తే చేయనన్నాడు... చిరంజీవి మరి ఎలా ఒప్పించాడు!

By Sambi ReddyFirst Published Sep 26, 2022, 3:29 PM IST
Highlights

గాడ్ ఫాదర్ మూవీలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటిస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ధృవీకరించారు.


గాడ్ ఫాదర్ చిత్రంలో అనేక విశేషాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించడం ఒక ఎత్తైతే సల్మాన్ క్యామియో రోల్ చేయడం మరొక ఎత్తు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార పవర్ ఫుల్ రోల్ చేయడం మరొక విశేషం. వీటితో పాటు గాడ్ ఫాదర్ మూవీలో ఊహించని సర్ప్రైజ్ ఉంది. అదేమిటంటే ఈ మూవీలో దర్శకుడు పూరి జగన్నాధ్ నటించాడు. టాలీవుడ్ లో కొన్నాళ్లుగా ఈ న్యూస్ ప్రచారం అవుతుండగా తాజాగా చిరంజీవి ధృవీకరించారు. గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి పూరి జగన్నాధ్ నటిస్తున్నట్లు వెల్లడించారు. 

కథ రీత్యా మూవీలో యూట్యూబర్ రోల్ ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే సందేహం కలిగింది. దర్శకుడు పూరి జగన్నాధ్ చక్కగా సరిపోతారని దర్శకుడు మోహన్ రాజాకు చిరంజీవి చెప్పారట. అయితే మీరే ఆయన్ని ఒప్పించాలని మోహన్ రాజా అన్నారట. పూరికి ఫోన్ చేసి చిరంజీవి విషయం చెప్పారట. దానికి పూరి ఛస్తే చేయను అన్నారట. మీ ముందు నేను నటించడం ఏమిటి సార్.. నా వల్ల కాదన్నాడట. అయితే చిరంజీవి పట్టుబట్టడంతో కాదనలేకపోయాడట. 

కాబట్టి గాడ్ ఫాదర్ మూవీలో పూరి జగన్నాధ్ నటిస్తున్నాడనేది నిజం. గతంలో పూరి చిన్న చిన్న క్యామియో రోల్స్ చేశారు. ఏమాయ చేశావే మూవీలో తన రియల్ లైఫ్ రోల్ డైరెక్టర్ గా  కనిపించారు.ఇక  గాడ్ ఫాదర్ లో ఆయన రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెంచేసింది. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరెకెక్కింది. అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గాడ్ ఫాదర్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 
 

click me!