డైరెక్టర్ గా పీటర్.. మొదటి హీరో అతడేనా ?

Published : Sep 20, 2019, 04:43 PM IST
డైరెక్టర్ గా పీటర్.. మొదటి హీరో అతడేనా ?

సారాంశం

సౌత్ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరితో ఫైట్స్ చేయించిన స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మాస్టర్ మెగాఫోన్ పెట్టనున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేశారు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించబోయే ఆ ప్రాజెక్ట్ లో హీరో ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.  

డైరెక్టర్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయినా పీటర్ మొదట ఏ హీరోతో వర్క్ చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ లో హీరోగా కనిపించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినబడుతోంది. బెల్లంకొండ కు అలాగే నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఎప్పటి నుంచో ఈ యువ హీరోతో సినిమా చేయాలనీ అనుకుంటున్న నిర్మాత మరికొన్ని రోజుల్లో ప్రాజెక్ట ని సెట్స్ పైకి తేనున్నాడు. 

పీటర్ హెయిన్స్ మొదట డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నాడు అనగానే ఎవరో స్టార్ హీరోనే అయ్యి ఉంటాడని అంతా భావించారు. రోబో - మగధీర - బాహుబలి - మన్యంపులి వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలకు ఫైట్స్ ను అందించిన పీటర్ మీడియం మార్కెట్ ఉన్న హీరోను సెలెక్ట్ చేసుకోవడం ఒక ప్రయోగమే. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..