ప్రభాస్ 'రాజా సాబ్' మూవీ.. డబ్బు మంచినీళ్లలా ఖర్చయిపోతోందిగా, 4 రోజులకు 4 కోట్లు

By tirumala ANFirst Published Mar 25, 2024, 5:05 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు రాజా సాబ్ అనే మీడియం బడ్జెట్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఒకవైపు కల్కి చిత్రం సమ్మర్ రిలీజ్ కి తుది మెరుగులు దిద్దుకుంటోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు రాజా సాబ్ అనే మీడియం బడ్జెట్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఒకవైపు కల్కి చిత్రం సమ్మర్ రిలీజ్ కి తుది మెరుగులు దిద్దుకుంటోంది. మరోవైపు ప్రభాస్ రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 

వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు. తాజాగా మారుతి రాజాసాబ్ విశేషాలు వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా తొలి చిత్రాన్ని నేను 30 లక్షల బడ్జెట్ లో తెరకెక్కించాను. 

కానీ ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ చిత్రానికి నాలుగు రోజుల్లో 4 కోట్లు ఖర్చయింది. ఇదే బడ్జెట్ లో నేను రెండు మూడు చిత్రాలు చేసేవాడిని. ప్రభాస్ నటిస్తున్న చిత్రం కాబట్టే అంత డబ్బు ఖర్చు చేయగలుగుతున్నాం అని మారుతి అన్నారు. 

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీ ఇదే. మారుతీ స్టైల్ లో కామెడీ ఉంటూనే ప్రభాస్ స్టైల్ లో యాక్షన్ కూడా ఉండబోతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. 

నాలుగు రోజుల్లో 4 కోట్లు ఖర్చు చేసారంటే అది ఎంత కీలక సన్నివేశమో అని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు కల్కి రిలీజ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో సూపర్ హీరోగా నటిస్తున్నాడు. మహాభారతం నుంచి 2898 సంవత్సరం వరకు మొత్తం 6 వేల సంవత్సరాల పరిధిలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని చూపించబోతున్నారు. 

click me!