
తాజాగా రవితేజ నటిస్తోన్న 'డిస్కో రాజా' చిత్రం కొత్త లుక్ ట్రై చేశాడంటూ లైట్ గెడ్డంతో ఉన్న ఆయన ఫోటో బయటకి వచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో ఈ లుక్ లో రవితేజ కనపడుతున్నాడంటూ కథనాలు ప్రచురించారు.
పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తున్న ఈ ఫోటోపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే ఈ ఫోటో ఫేక్ అని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఫోటో అఫీషియల్ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్ వెల్లడించారు.
నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రిభినయం పోషించనున్నాడట. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . అయితే ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు.
మరో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయల్‌ని ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.