‘బ్లాక్ బాస్టర్ రాబోతోంది.. త్వరలోనే షూటింగ్ డిటేయిల్స్’.. RC16పై బుచ్చిబాబు కామెంట్స్..

Published : Aug 26, 2023, 12:23 PM IST
‘బ్లాక్ బాస్టర్ రాబోతోంది.. త్వరలోనే షూటింగ్ డిటేయిల్స్’.. RC16పై బుచ్చిబాబు కామెంట్స్..

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - బుచ్చిబాబు కాంబినేషన్ లో RC16 రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.   

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో చెర్రీ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు విశేష ఆదరణ దక్కింది. చరణ్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ఆస్కార్ ప్రమోషన్స్ లో చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో గ్లోబల్ స్టార్ క్రేజ్ నూ దక్కించుకున్నారు. rrrకి మొన్న ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ కూడా దక్కడం విశేషం. ఈక్రమంలో చరణ్ నెక్ట్స్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) తెరకెక్కించిన Uppenaకు కూడా ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. దీంతో బుచ్చిబాబుకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెక్ట్స్ తెరకెక్కించబోతున్న RC16పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.... నెక్ట్స్ నేను రామ్ చరణ్ సినిమా చేస్తున్నాను. ఇది కచ్చితంగా బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ సబ్జెక్ట్. నాలుగు సంవత్సరాలుగా ఈ చిత్రంపైనే వర్క్ చేస్తున్నాను. ఇంకా సబ్జెక్ట్ ను డెవలప్ చేసేందుకు ఇంకాస్తా సమయం ఇవ్వండి. ఈ చిత్రం లాంచింగ్, షూటింగ్ డిటేయిల్స్ ను నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నారని తెలిపారు. 

ఇక ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇప్టపికే చిత్రాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. త్వరలో ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రాన్ని సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నాయి. హీరోయిన్, టెక్నీషియన్ల డిటేయిల్స్ తెలియాల్సి ఉంది. 

ప్రస్తుతం చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఈ చిత్రం పలు విధాలుగా ఆలస్యం అవుతూనే వస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్  రాజ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది.  థమన్ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?