
అఖండ (Akhanda)మూవీతో బాలయ్యకు మరపురాని విజయం అందించారు బోయపాటి. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ భారీ విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో వంద కోట్ల వసూళ్ళను సాధించిన మొదటి చిత్రంగా అఖండ నిలిచింది. దానికి తోడు ఆయన వరుస ప్లాప్స్ లో ఇబ్బందిపడుతున్నారు. బాలయ్య మార్కెట్ ఊహించని రీతిలో డామేజ్ అయ్యింది. అలాంటిది అఖండ ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలై అద్భుత విజయం సాధించండి. ఇంకా తెలుగు రాష్ట్రాలలో అఖండ రన్ అక్కడక్కడా కొనసాగుతుంది.
ఇక వంద రోజులు పూర్తి చేసుకున్న అఖండ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అఖండ విజయం అందించిన ఊపులో బాలకృష్ణ (Balakrishna)తన 107వ చిత్రం మొదలుపెట్టారు. క్రాక్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య లుక్ ఇప్పటికే బయటికి రాగా ఫ్యాన్స్ కి ఆకట్టుకుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
సీనియర్ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హైవోల్టేజ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. కాగా ఈ మూవీ సెట్స్ ని దర్శకుడు బోయపాటి (Boyapati Srinu)సందర్శించారు. బోయపాటికి దర్శకుడు గోపీచంద్, బాలయ్య వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి ఆయన వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక శృతి హాసన్ బాలయ్యతో మొదటిసారి జతకడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. గోపీచంద్ మలినేనితో శృతి హాసన్ కి మూడో చిత్రం కావడం విశేషం. గతంలో రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన బలుపు, క్రాక్ చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. పరిశ్రమలో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.