
దిగ్గజ నటులు, దిగ్గజ దర్శకులు, దిగ్గజ నిర్మాతలు మొత్తానికి దిగ్గజ తారాతోరణం బాలీవుడ్. కాని ఇప్పుడు అదే బాలీవుడ్ వెలవెలబోతోంది. వారి సినిమాలను దేశవ్యాప్తంగా మెప్పించడం తరువాత సంగతి..ముందు హిందీ జనాలే.. ఆసినిమాలు ఆదరించడం లేదు. బాలీవుడ్ ను బాయ్ కాట్ చేయాలంటూ.. హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. మంరి ఇంత మంది దిగ్గజాలు ఉన్న బీటౌన్ కు ఏమయ్యింది. మన తెలుగు సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు ఎందుకు వెలవెల బోతున్నాయి. బాలీవుడ్ పరిశ్రమ పని అయిపోయిందా. ఫిల్మ్ మేకర్స్ లో పట్టు తగ్గిపోయిందా..? దర్శకుల టాలెంట్ ఇనికిపోయిందా..?
ఆడియన్స్ కు కావల్సిన సినిమాలో అందించడంలో బాలీవుడ్ తడబడుతోంది అంటున్నారు యంగ్ హీరో రణ్ బీర్. ఏ తరహా సినిమాలు అందించాలనే విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ అయోమయంలో పడిందని అంటున్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. వెస్ట్రన్ సినిమా ప్రభావానికి లోనుకావడమే ఇందుకు కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు. రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ..గత ఇరవై ఏళ్ళుగా... బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఫిల్మ్ మేకింగ్ లో తడబడుతుంది.. ఫిలిం మేకింగ్‌లో కన్ఫ్యూజ్ అవుతుంది అన్నారు. ఏ తరహా సినిమాలతో సక్సెస్ సాధించవచ్చు అనేదాని విషయంలో.. స్పంస్టతను అంతకంతకూ కోల్పోతోంది అన్నారు. అంతే కాదు హాలీవుడ్ ను ఫాలో అవ్వడం, ఆసినిమాలు రీమేక్ చేయడం.. ఆ స్టైల్ ను పులుముకోవడం వల్లే ఈపరిస్థితి వచ్చిందన్నారు రణ్ బీర్.
అంతే కాదు.. కొత్తదనం ఇవ్వాలి అన్న ఆరాటంలో.... హాలీవుడ్ ను ఫాలో అవుతూ.. సినిమాలు చేసుకుంటూ వెల్తున్నాం కాని.. మన ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు. వారికి ఏ సినిమా ఇష్టమో అవి మర్చిపోయాం. కొద్ది మంది నటీనటులైతే కొత్త దర్శకులకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. దాంతో బాలీవుడ్ లోకి కొత్త కంటెంట్ రావడంలేదు. కొత్తి నీరు రావడంలేదు. టాలెంట్ తొక్కివేయబడుతుంది. అందుకే కొత్త వాళ్లను ప్రోత్సహించాలి. అప్పుడే జనాల్లోనుంచి దర్శకులు బయటకు వచ్చి.. ఆ జనాలకు కావల్సిన సినిమాలు చేస్తారు అని అన్నాు రణ్ బీర్.
దీనివల్ల వైవిధ్యమైన సినిమాలు తెరపైకి వస్తాయి అన్నారు. రీసెంట్ గా తూ జూతీ మై మక్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. ప్రస్తుతం ఆయన ఖాతాలో యానిమల్ సినిమా కూడా ఉంది. ఈసినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. రష్మిక మందన్నా రణ్ బీర్ జోడీగా నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో తెలుగు దర్శకుల హవా కూడా పెరుగుతూ వస్తోంది.