డైరక్టర్ బాపుగారి 'కోపం ఉత్తరం' మీకు తెలుసా?

By Udayavani DhuliFirst Published Nov 1, 2018, 12:06 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు బాపు గారు తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. వాటికన్నా చక్కటి తెలుగుతనం ఉట్టిబడే సినిమాలు తెలుగు జాతికి ఇచ్చారు. 

ప్రముఖ దర్శకుడు బాపు గారు తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. వాటికన్నా చక్కటి తెలుగుతనం ఉట్టిబడే సినిమాలు తెలుగు జాతికి ఇచ్చారు. అలాగే తన కార్టూన్స్ తో ఇప్పటికి జనాలని నవ్విస్తూనే ఉన్నారు. తన బొమ్మలతో అలరిస్తూనే ఉన్నారు. తన బాపు ఫాంట్ తో తెలుగు భాషకి ఓ కొత్త లుక్ ని పరిచయం చేసి ఆనందింపచేసారు. 

అయితే ఇవన్నీ ఒకెత్తు... ఆయనతో జీవితకాలం పరిచయం ఉండి, టచ్ లో ఉన్నవారు చెప్పే విషయాలు ఒకెత్తు. ప్రముఖ రచయత, కార్టూనిస్ట్ బ్ని అలాంటి వారిలో ఒకరు. ఆయన ..చాలా సంవత్సరాల పాటు బాపు, ముళ్లపూడి రమణలతో సన్నిహితంగా గడుపుతూ వచ్చారు. స్నేహశీలి అయిన బ్నిం గారు .. బాపుగారికి చెందిన ఓ చిన్న సందేశాన్ని  మనకు అందించారు. అది ఇక్కడ చూడవచ్చు. దానితో పాటు ఆయన చెప్పిన మాటలు కూడా చూద్దాం. 

"బాపూ గారికి కోపం ఎక్కువే .. అలా ఏ వ్యక్తినైనా తిట్టాలనిపిస్తే వెంటనే ఉత్తరం రాసేసి పోస్ట్ చేసేముందు .... ఆలోచించే సహనం లేకపోతే ..నాబోటివాడికి పోస్ట్ చేసి ... పోస్ట్ చేయచ్చా ఆలోచించి చేయమంటారు ..ఆతర్వాత ..వద్దులెండి ... వదిలేద్దాం... అని ఫోనేచేసి చెప్పడం చాలాసార్లే జరిగింది ..."

నిజానికి  బాపు గారి అభిమానులకే కాక మిగతా వాళ్లకు కూడా అత్యవసరమైన సలహానే. మరి మీరు కూడా పాటించండి..అయితే ఈ రోజుల్లో ఉత్తరాలు రాయటం మానేసాము కదా అంటారా...సరదాగా రాద్దాం అనుకోండి..లేదా ఫోన్ చేసి తిట్టే ముందు కూడా ఓ నిముషం ఆలోచిచండి. 

click me!