బెడిసికొట్టిన రిలేషన్: హీరోయిన్ ని ఫ్లాట్ రిటర్న్ ఇవ్వమంటున్న డైరెక్టర్!

By Udaya DFirst Published Feb 4, 2019, 3:52 PM IST
Highlights

టాలీవుడ్ లో దర్శకుడిగా సినిమాలు చేసిన ఓ వ్యక్తి హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు. సదరు హీరోయిన్ కి సరైన అవకాశాలు రాక దర్శకుడిని నమ్ముకుంది. ఇద్దరి మధ్య ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా రిలేషన్ సాగించారు. 

టాలీవుడ్ లో దర్శకుడిగా సినిమాలు చేసిన ఓ వ్యక్తి హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు. సదరు హీరోయిన్ కి సరైన అవకాశాలు రాక దర్శకుడిని నమ్ముకుంది. ఇద్దరి మధ్య ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా రిలేషన్ సాగించారు.

రిలేషన్ లో ఉన్న సమయంలో డైరెక్టర్ గారు హీరోయిన్ కి గిఫ్ట్ గా ఖరీదైన అపార్ట్ మెంట్ కొనిచ్చారు. ఆ ఫ్లాట్ లోనే ఇద్దరూ కలిసి ఉండేవారు. సదరు డైరెక్టర్ కి పెళ్లై పిల్లలుఉన్నా.. హీరోయిన్ తో రిలేషన్ ని కంటిన్యూ చేశాడు. కానీ ఫైనల్ గా ఇద్దరికీ బ్రేకప్ అయింది.

సదరు డైరెక్టర్ రూపొందించిన సినిమాలో ఈ స్ట్రగులింగ్ హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆమె హర్ట్ అయ్యి అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఎప్పుడైతే ఇద్దరి రిలేషన్ బ్రేకప్ అయిందో డైరెక్టర్ ఫ్లాట్ నుండి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ ఫ్లాట్ గురించి ఇద్దరూ గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.

తను గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్లాట్ ని తిరిగివ్వమని డైరెక్టర్ అడిగితే.. దానికి ఈ హీరోయిన్ ఇవ్వనని తేల్చి చెప్పిందట. పైగా ఫ్లాట్ తన పేరు మీదే ఉండడంతో డైరెక్టర్ కూడా ఏం చేయలేని పరిస్థితి. కానీ చూస్తూ చూస్తూ అంత కాస్ల్టీ ఫ్లాట్ ని హీరోయిన్ కి వదిలేయలేక ఈ విషయంలో ఏదొకటి చేయాలని  ఆలోచిస్తున్నాడట. 

click me!