ఆ డైరెక్టర్ కి దిల్ రాజు కాస్ట్లీ కార్ గిఫ్ట్!

Published : Apr 05, 2019, 01:04 PM IST
ఆ డైరెక్టర్ కి దిల్ రాజు కాస్ట్లీ కార్ గిఫ్ట్!

సారాంశం

ఈ మధ్యకాలంలో దిల్ రాజు తన టీమ్ ని చాలా బాగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ మధ్యకాలంలో దిల్ రాజు తన టీమ్ ని చాలా బాగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 2' సినిమా సక్సెస్ కావడంతో యూనిట్ మొత్తాన్ని ట్రిప్ కోసం తన సొంత ఖర్చులతో విదేశాలకు పంపించాడు.

తాజాగా ఓ డైరెక్టర్ కి కారుని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడు వేణుశ్రీరాం 'ఎంసిఏ' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ అయినప్పటికీ వేణుశ్రీరాం తన నెక్స్ట్ సినిమాకి మరో నిర్మాత దగ్గరకి వెళ్లకుండా దిల్ రాజు వద్దే ఉన్నాడు. 

రీసెంట్ గా కథ సిద్ధం చేసుకొని అల్లు అర్జున్ కి వినిపించాడు. అది బన్నీకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయనున్నాడు.

ఈ సందర్భంగా దిల్ రాజు.. తన డైరెక్టర్ కి హ్యుండయ్ కంపనీకి చెందిన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడట. ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో వేణు-బన్నీల సినిమా సెట్స్ పైకి వెళ్తుంది!

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ గెస్ట్ రోల్‌లో నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏంటో తెలుసా.? హీరో ఎవరంటే.!
భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్