రజనీ బయోపిక్..డైరక్టర్, హీరో ఖరారు

By Surya PrakashFirst Published Nov 8, 2020, 6:14 PM IST
Highlights

నిజ జీవితంలో చాలా తక్కువగా మాట్లాడతారు... కానీ, ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీసు బద్దలు కొడుతుంటాయి. బెంగళూరులోని ఓ ట్రాన్స్‌ పోర్ట్‌ సర్వీసులో కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకునేంత విజయవంతంగా సాగింది.
 

గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలు చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తిని చూపుతుండటంతో అవి తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్టీఆర్, జయలలిత వంటి సిని సూపర్ స్టార్స్ బయోపిక్ లు తెరకెక్కాయి. ఇప్పుడు  సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్‌ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. తమిళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రజనీకాంత్‌కి పెద్ద అభిమాని అయిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్‌ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. 

ఇందులో రజనీ పాత్రలో ఆయన పెద్దల్లుడు ధనుష్‌ని నటింపజేయాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సూపర్‌స్టార్‌ కు చాలా ప్రత్యేకలు ఉన్నాయి. ఆయన నిజ జీవితంలో చాలా తక్కువగా మాట్లాడతారు... కానీ, ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీసు బద్దలు కొడుతుంటాయి. బెంగళూరులోని ఓ ట్రాన్స్‌ పోర్ట్‌ సర్వీసులో కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకునేంత విజయవంతంగా సాగింది.

 బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి కలర్‌ వరకూ అందరూ ఆయన్ను ఇష్టపడేవారు. 70  ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా హుషారుగా ఫైట్లు, డ్యాన్స్‌లతో అదరగొడుతున్న ఆయన బయోపిక్ లో రజనీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు, సంఘటనల్ని స్క్రిప్టుగా రెడీ చేసారట. కె.బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగన్‌గల్‌ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లో మెరిశారు. కండెక్టర్ నుంచి టాప్ హీరోగా ఎదిగిన ఆయన జీవితాన్ని ఎంతోమంది ఆదర్శంగా భావిస్తారు.

click me!