టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ధన్ రాజ్ దర్శకత్వంలోని మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది. హన్సికా మూవీ విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తమిళ నటుడు సముద్రఖని Samuthirakhani - కమెడియన్ ధనరాజ్ Dhanraj కాంబోలో ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. ధనరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమే ఇది. ఈ చిత్రానికి ‘రామం రాఘవం’ Ramam Raghavam అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే తాజాగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణం లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ద్విభాష చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్ ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు.. ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.
హన్సిక ‘105 మినిట్స్’ మూవీ విశేషాలు...
స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫీమెల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ‘మై నేమ్ ఈజ్ శృతి’ చిత్రంతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో జనవరి 26న ‘105 మినిట్స్’ 105 Minutes చిత్రంతో అలరించబోతోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాజు దుస్సా సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు.
05 మినిట్స్ ఒక కొత్త కాన్సెప్ట్. ఒకటే క్యారెక్టర్ ని ఒక పర్టికులర్ టైం లో ఒక లెంగ్తి షాట్ తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఈ సినిమా. సింగిల్ క్యారెక్టర్ తో రెండుగంటల సినిమా ఉంటుంది. ఇది రియల్ టైం లో మీరు అక్కడ కూర్చుని లైవ్ లో చూస్తే ఎదురుగా జరుగుతుందనే కథ. ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్కువ రాలేదు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ 105 మినిట్స్ లో కంప్లీట్ చేసాం. హన్సిక ఈ ప్రాజెక్టు ను ఒప్పుకోవడం చాలా హ్యాపీ. సింగిల్ షాట్ మూవీ కావడంతో మా డీవోపీ కిషోర్ నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసాం.
హీరోయిన్ అంటే సాంగ్స్, రొమాన్స్ అని కాకుండా ప్రతి ఫ్రేమ్ లో పెర్ఫార్మన్స్ ఉంటుంది. సినిమాను వందశాతం అనుకున్నది అనుకున్నట్టుగానే తీసాం. చిత్రంలో ప్రధానంగా డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాగుంటుంది. చిత్రంలో నెక్ట్స్ సెకండ్ కూడా ఏం జరుగుతుందో చెప్పలేరు. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటి అంటే ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆట.