వాటర్ కేన్ తో మోతమోగిస్తున్నదేవీశ్రీ.. వాల్తేరు వీరయ్యకు అలా.. ఇప్పుడిలా.. వైరల్ వీడియో

By Asianet News  |  First Published Jul 23, 2023, 3:57 PM IST

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు విదేశాల్లోనూ పెర్ఫామ్ చేస్తూ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో దేవీ వదిలిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 
 


రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సూపర్ హిట్ చార్ట్ బస్టర్ ను అందించిన ఘనత ఆయనది. మెలోడీ, లవ్ ట్రాక్స్,, అదిరిపోయే బీజీఎంలతో సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ అదే పంథాలో పయనిస్తున్నారు. 24 ఏళ్ల కేరీర్ లో వందకుపైగా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ బిగ్ ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ బిజీగా ఉన్నారు. 

మరోవైపు మ్యూజిక్ ఈవెంట్స్ తోనూ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విదేశాల్లో ఎక్కువగా పెర్ఫామెన్స్  చేస్తూ కనిపిస్తున్నారు. ఈనెల జూలై2న డల్లాస్, జూలై 15న సీటెల్ లో పెర్ఫామ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ నిన్న యూఎస్ఏలోని శాన్ జోస్ లో తన మ్యూజిక్ తో ఆడియెన్స్ ను అలరించారు. ఈవెంట్ లో సింగర్స్ సాగర్, రీటా, పృధ్వీ, ఇంద్రావతి చౌహాన్, హేమచంద్ర, మంగ్లీ వంటి ప్రముఖ గాయకులు ఉన్నారు. టూర్ హోస్ట్ గా అనుసయ భరద్వాజ్ కూడా వెళ్లారు. డీఎస్పీ తనదైన శైలిలో పెర్ఫామెన్స్ ఇచ్చి  ప్రేక్షకులను ఉత్సాహ పరిచారు. 

Latest Videos

ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ కు ముందు దేవీశ్రీ ప్రసాద్ వదిలిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారీ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ తో సంగీతం అందించడం సాధారణంగా వింటూనే ఉంటాం. కానీ మనం నిత్యంవాడే వస్తువులతోనూ దేవీశ్రీ డప్పుకొట్టి ఆకట్టుకుంటున్నారు. అప్పట్లో జాతరలో దొరికే చిన్న పీకలాంటి ఇన్ స్ట్రుమెంట్ తో ‘వాల్తేరు వీరయ్య’లోని బాస్ పార్టీకి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా వాటర్ కేన్ తో మోతమోగించి ఆకట్టుకున్నారు. తన టాలెంట్ ను విభిన్నంగా ప్రదర్శించి ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక 2021లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’కు అద్భుతమైన సంగీతం అందించి ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యేలా చేశారు. ఈ మూవీలోని ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావా’, ‘రారా సామీ’ వంటి సాంగ్ ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. దీంతో సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న Pushpa 2కి ఇంకెలా మ్యూజిక్ ఇవ్వనున్నారని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’కూ, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూ దేవీనే సంగీతం అందిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

 

click me!