నాగార్జున - నాని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్!

By rajesh yFirst Published Sep 24, 2018, 2:32 PM IST
Highlights

ప్రస్తుతం అందరి చూపు దేవ దాస్ యూఎస్ ప్రీమియర్స్ పైనే ఉంది. అక్కడ సినిమా ఏ స్థాయిలో వసులు చేస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 27 సినిమాను ఇండియాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగానే ఓవర్సీస్ లో (ప్రీమియర్స్ ) కూడా హై లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. 

చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో ఒక సరికొత్త మల్టి స్టారర్ రానున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున - న్యాచురల్ స్టార్ నాని కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం దేవ దాస్. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సినిమాకు తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇకపోతే సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా అంతటా బిజినెస్ పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం అందరి చూపు దేవ దాస్ యూఎస్ ప్రీమియర్స్ పైనే ఉంది. అక్కడ సినిమా ఏ స్థాయిలో వసులు చేస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 27 సినిమాను ఇండియాలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగానే ఓవర్సీస్ లో (ప్రీమియర్స్ ) కూడా హై లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. 

ఫ్లై హై సినిమాస్ సంస్థ దేవ దాస్ సినిమాను అమెరికాలో 180 లొకేషన్స్ లో ఒకరోజు ముందుగానే (సెప్టెంబర్ 26) ప్రదర్శించనున్నారు. నాని - నాగార్జున కెరీర్స్ లోనే ఇది భారీ ప్రీమియర్ రిలీజ్ అని చెప్పాలి.  ఇద్దరి హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో సినిమా ఈజీగా రికార్డ్ బ్రేక్ చేస్తుందని టాక్. ఇక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సీజన్ లో బెస్ట్ సినిమాగా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.       

 

click me!