#Devara టీజర్‌ రిలీజ్ ఎగ్టాక్ డేట్ ఆ తర్వాతే ఫిక్స్

By Surya PrakashFirst Published Dec 9, 2023, 12:27 PM IST
Highlights

దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు.


ఎన్టీఆర్ త్వరలోనే దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వస్తోంది. దేవర టీజర్ ను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.   డిసెంబర్‌ 25 అది తప్పితే  జనవరి ఒకటో తేదీన టీజర్‌ వస్తుందని  అంటున్నారు. అయీతే అదే సమయంలో  'దేవర’ టీజర్‌ని (teaser) సలార్‌, డంకీ విడుదలయ్యే థియేటర్స్‌లో చూడొచ్చని శుక్రవారం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై మేకర్స్‌ నుంచి ఎలాంటి  అఫీషియల్ గా ప్రకటన లేదు. కానీ సోషల్‌ మీడియా , ఫ్యాన్స్  పేజీల్లో ఈ వార్త విపరీతం వైరల్ అవుతోంది. అయితే టీమ్ ఈ విషయం కన్ఫర్మ్ చేయాలనే టెక్నికల్ గా ఓ సమస్య ఉందని అంటున్నారు.

ఈ టీజర్ కు సంభందించిన VFX వర్క్ అప్పటికి పూర్తి కావాలని,అప్పుడు మాత్రమే రిలీజ్ చేయగలరు అంటున్నారు. VFX వర్క్ ఏ మాత్రం తేడా కొట్టినా ట్రోలింగ్ అవుతుంది కాబట్టి, ఒకటికి నాలుగు సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వదలాలి అనుకుంటున్నారట. VFX షాట్స్ టీజర్ లో  కొద్దిగానే ఉన్నా అవి అద్బుతంగా ఉంటే దాన్ని బట్టే బజ్ క్రియేట్ అయ్యి, బిజినెస్ ప్రారంభమవుతుందనేది ట్రేడ్ అంటున్నమాట. అయితే ఏదైనా VFX వర్క్ సంతృప్తిగా అనిపించాకే ముందుకు వెళ్తారు. 

Latest Videos

ఇక  మరో ప్రక్క కొందరు అభిమానులు మాత్రం  ఓవర్సీస్లో  డంకీ సినిమాకి, ఇండియాలో సలార్‌ సినిమాకి సూపర్‌ బజ్‌ ఉంటుంది  కాబట్టి ఎట్టి పరిస్దితుల్లో   ఈ చిత్రాలతో 'దేవర' టీజర్ విడుదల చేస్తే రీచ్ బావుంటుందని భావిస్తున్నారు.  దేవర  వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సముద్రం ప్రాముఖ్యత వహిస్తోంది. కాబట్టి  విజువల్ ఎఫెక్ట్స్ పై ఎక్కువ దృష్టి సారించనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక దేవర మూవీలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇక దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో సైఫ్‌ అలీఖాన్ పై  ఇంట్రడక్షన్ సీన్స్ తీశారు. 

click me!