
నెట్ఫ్లిక్స్ సీఈఓ గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు టాలీవుడ్ టాప్ స్టార్స్ నుండి ఆతిథ్యం లభిస్తుంది. టెడ్ సరండోస్ అండ్ టీమ్ ని చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు. హైదరాబాద్ లో దిగడంతోనే టెడ్ సరండోస్ నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. చిరంజీవి, రామ్ చరణ్ ఆయనతో ముచ్చటించారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత రోజు టెడ్ సరండోజ్ టీమ్ ఎన్టీఆర్ ని కలిశారు. నెట్ఫ్లిక్స్ బృందానికి ఎన్టీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. తన సంభాషణల్లో సినిమాపై తమకున్న ప్రేమ, ఫుడ్ రిలేటెడ్ విషయాలు మాట్లాడుకున్నట్లు ఎన్టీఆర్ తెలియజేశారు. టెడ్ సరండోస్ కి ఆతిథ్యం ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు.
టెడ్ సరండోజ్ హైదరాబాద్ లో మూడో రోజు పర్యటిస్తున్నారు. నేడు ఉదయం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు. ఈ విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్, ఆయన టీమ్ మెంబర్ మోనిక షెర్గిల్ తో టీ టైం ఎంజాయ్ చేసినట్లు మహేష్ బాబు కామెంట్ చేశారు.
భవిష్యత్ లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందనే విషయాలు తమ భేటీలో చర్చకు వచ్చినట్లు మహేష్ బాబు తెలియజేశారు. వీరితో మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా జాయిన్ అయ్యారు. మహేష్ తో టెడ్ సరండోజ్ కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టార్స్ ని కలవడం ద్వారా టెడ్ సరండోస్ నెట్ఫ్లిక్స్ కి మంచి పబ్లిసిటీ రాబడుతున్నారు. ఇండియాలో నెట్ఫ్లిక్స్ బిజినెస్ విషయంలో స్ట్రగుల్ అవుతుంది.
నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ కి ఎన్టీఆర్ ఆతిథ్యం... ఆ విషయంలో పోటీపడుతున్న ఆర్ ఆర్ ఆర్ హీరోలు!