కమల్ హాసన్, శివకార్తికేయన్ ను అరెస్ట్ చేయండి, తమినాడులో ఆందోళనలు.. కారణం ఏంటంటే..?

By Mahesh Jujjuri  |  First Published Feb 22, 2024, 11:45 AM IST

కమల్ హాసన్ తో పాటు  హీరో శివకార్తికేయన్  ను కూడా అరెస్ట్ చేయాలని తమిళనాట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దానికి కారణం అమరన్ మూవీ కావడంతో సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 


కోలీవుడ్ లో యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న అమరన్ సినిమా  భారీ స్థాయిలో రూపొందుతోంది . రంగూన్ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా. శివకార్తికేయన్ సరసన నటి సాయి పల్లవి హీరోనయిన్ గా నటించింది. ఇక ఈమూవీని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అంతే కాదు  జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈసినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈమూవీ చిక్కుల్లో పడింది. వీరమరణం పొందిన సైనికుడు ముకుందన్ జీవితం ఆధారంగా అమరన్ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా హీరో శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, అదే రేంజ్ లో వివాదాస్పదంగా కూడా మారింది టీజర్. ఈ టీజర్ లో వివాదాస్పద  సన్నివేశం ఉందనే కారణంతో సినిమాను నిషేధించాలని తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరపున నిన్న నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది.

Latest Videos

అమరన్ టీజర్‌లో కాశ్మీరీలు, ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే దృశ్యాలు ఉన్నందున నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సామరస్యంగా జీవించే హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేలా ఈ సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అమరన్ సినిమా రిలీజ్ కు అడ్డంకులుతప్పేలా కనిపించడంలేదు. అంతే కాదు.. టీజర్ కే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణలు ఉదృతం అయ్యాయి. 

తమిళనాడు వ్యాప్తంగా జరిగిన ఈ నిరసనలో అమరన్‌ హీరో శివకార్తికేయన్‌  తో పాటు నిర్మాత కమల్‌హాసన్‌, దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామిలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోలణలు ఉదృతం చేయడంతో పాటు.. వారి దిష్టిబొమ్మలను రోడ్డుపై దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తిరుచ్చిలో ఉత్కంఠ నెలకొంది.


 

click me!