'తమిళ్ రాకర్స్' అంతు చూడండి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు!

By tirumala ANFirst Published Aug 12, 2019, 9:20 PM IST
Highlights

సినీ నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు పైరసీ వెబ్ సైట్ సంస్థ తమిళ్ రాకర్స్ కొరకరాని కొయ్యగా మారింది. పైరసీ భూతాన్ని తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ్ రాకర్స్ సంస్థ మాత్రం నిర్మాతలకు నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. సినిమా విడుదల రోజే ఈ వెబ్ సైట్ లోపైరసీ ప్రింట్లు దర్శనం ఇస్తున్నాయి.

సినీ నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు పైరసీ వెబ్ సైట్ సంస్థ తమిళ్ రాకర్స్ కొరకరాని కొయ్యగా మారింది. పైరసీ భూతాన్ని తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ్ రాకర్స్ సంస్థ మాత్రం నిర్మాతలకు నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. సినిమా విడుదల రోజే ఈ వెబ్ సైట్ లోపైరసీ ప్రింట్లు దర్శనం ఇస్తున్నాయి. నిర్మాతలు అప్పటికప్పుడు స్పందించి లింకులని తొలగించే తాత్కాలిక చర్యలు తప్ప తమిళ్ రాకర్స్ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. 

తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలనీ, దానికి అనుబంధంగా ఉన్న లింకులని సైతం బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలకు ఢిల్లీ హై కోర్టు ఉత్తర్వలు జారీ చేస్తూ.. వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. 

తమిళ్ రాకర్స్ సంస్థని అంతం చేసేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు వార్నర్ బ్రదర్స్, నెట్ ఫ్లిక్స్, స్టార్ లాంటి సంస్థలు రంగంలోకి దిగాయి. తమ వెబ్సైట్స్ లో ఉన్న కంటెంట్ ని తమిళ్ రాకర్స్ సంస్థ అక్రమంగా పైరసీ చేస్తూ స్ట్రీమింగ్ నిర్వహిస్తోందని ఈ సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

click me!