
ఇటీవల ప్రభాస్ సినిమాకు సంబంధించి భారీ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ సరసన జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని ప్రభాస్, దీపికా పదుకొణేలు తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ప్రభాస్.. `దీపికాతో కలిసి వర్క్ చేయటం ఆనందంగా ఉంది` అంటూ ట్వీట్ చేశాడు. అందుకు బదులుగా దీపిక స్పందిస్తూ `మీ స్వాగతానికి కృతజ్ఞతలు. ఈ గొప్ప ప్రయాణం ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ప్రభాస్, దీపికల అభిమానులు ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమాను మించి ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను అశ్వనీదత్‌తో కలిసి స్వప్నా దత్, ప్రియాంక దత్‌లు నిర్మిస్తున్నారు.