దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో సందడి.. ఏం చేయబోతుందంటే?

Published : Mar 03, 2023, 04:57 PM IST
దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం.. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో సందడి.. ఏం చేయబోతుందంటే?

సారాంశం

`ప్రాజెక్ట్ కే`తో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ అవార్డుల వేడుకలో పాల్గొనే అరుదైన అవకాశం వరించింది. 

పాన్‌ ఇండియా హీరోయిన్‌ దీపికా పదుకొనెకి అరుదైన గౌరవం దక్కింది. ఆమె ఆస్కార్‌ అవార్డుల ప్రజెంటర్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఆస్కార్‌ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆస్కార్‌ అవార్డులను ప్రధానం చేసే వేడుకలో దీపికా పదుకొనె పాల్గొనబోతుండటం విశేషం. అయితే హాలీవుడ్‌ దిగ్గజ స్టార్స్ తోపాటు దీపికా పదుకొనె సైతం ఆస్కార్‌ అవార్డులను విజేతలకు అందివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది దీపికా పదుకొనె. ఆస్కార్‌  ప్రకటించిన లిస్ట్ ని పోస్ట్ చేస్తూ హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకుంది. 

ఇందులో జెన్నిఫర్‌ కన్నెలే, శామ్యూల్‌ ఎల్‌ జాన్సన్‌, డ్వేన్‌ జాన్సన్‌, జోయ్‌ సాల్డనా, మైఖేల్‌ బి జోర్దాన్‌, ఎమిలి బ్లంట్‌, జోనాథన్‌ మేజర్స్ వంటి 16 మంది సెలబ్రిటీల జాబితాలో దీపికా పేరు ఉండటం విశేషం. ఇండియా నుంచి ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నటిగా దీపికా పదుకొనె నిలవడం విశేషం. మార్చి 12న లాస్‌ ఏంజెల్స్ నగరంలోని డాల్బీ థియేటర్‌లో ఈ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. 

గతంలోనూ దీపికా పదుకొనె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్‌గా ఉన్నారు, అలాగే ఫిపా వరల్డ్ కప్‌ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతీష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ప్రజెంట్‌గా పాల్గొనే ఛాన్స్ రావడం నిజంగా ఇది అరుదైన గుర్తింపుగా భావించవచ్చు. ఇక ఈ సారి ఇండియా నుంచి `ఆర్ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని `నాటు నాటు` పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. అవార్డు పట్ల చిత్ర బృందం నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి ఇతర టీమ్‌ పాల్గొంటుంది. త్వరలోనే ఎన్టీఆర్‌ వీరితో జాయిన్‌ కానున్నారు. ఇక ఆస్కార్‌ వేడుక స్టేజ్‌పై రాహుల్‌ సిప్లిగంజ్‌, కాళభైరవ `నాటు నాటు` సాంగ్‌ని పాడబోతున్నారు.

ఇదిలా ఉంటే దీపికా పదుకొనె సినిమాల పరంగా ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే` చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తుంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దిశా పటానీ సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. దీంతోపాటు దీపికా ఇప్పుడు `ఫైటర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే `జవాన్‌`లో గెస్ట్ రోల్‌ చేస్తుంది. ఇటీవల షారూఖ్‌తో `పఠాన్‌`లో నటించి కెరీర్‌ బెస్ట్ హిట్‌ ని అందుకుంది దీపికా.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు