సాయి పల్లవితో స్టెప్స్ వేసిన వార్నర్!

By team teluguFirst Published May 20, 2021, 11:27 AM IST
Highlights

ఖాళీగా ఉన్న సమయాన్ని కుటుంబంతో భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు వార్నర్. తాజాగా మరో ఆసక్తికర వీడియోతో ఫ్యాన్స్ కి ట్రీట్ పంచారు వార్నర్. సాయి పల్లవితో పాటు ఆయన స్టెప్స్ వేశారు.

క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలు చాలా పాప్యులర్. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వార్నర్ ఇంస్టాగ్రామ్ లో చేసిన రచ్చ వరల్డ్ వైడ్ వైరల్ అయ్యాయి. మహేష్ బాబు, ప్రభాస్ సినిమా సీన్స్ ని ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన వీడియోలు పిచ్చ పాప్యులర్ అయ్యాయి. ఇక అల వైకుంఠపురంలో చిత్రంలోని బుట్ట బొమ్మ... సాంగ్ కి భార్య పిల్లలతో కలిసి డాన్స్ వీడియో చేశారు డేవిడ్ వార్నర్. 


ఖాళీగా ఉన్న సమయాన్ని కుటుంబంతో భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు వార్నర్. తాజాగా మరో ఆసక్తికర వీడియోతో ఫ్యాన్స్ కి ట్రీట్ పంచారు వార్నర్. సాయి పల్లవితో పాటు ఆయన స్టెప్స్ వేశారు. సాయి పల్లవితో వార్నర్ డాన్స్ చేయడమేంటని మీరు ఆశ్చర్య పోకండి. ఎందుకంటే డేవిడ్ సాయి పల్లవితో నిజంగా డాన్స్ వేయలేదు. 


ధనుష్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన మారి 2 మూవీలోని మాస్ సాంగ్ రౌడీ బేబీ పిచ్చ పాప్యులర్ అయ్యింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ ని ఎంచుకున్న డేవిడ్ ఫేస్ మార్ఫింగ్ యాప్ ద్వారా ధనుష్ ముఖాన్ని తన ముఖంగా మార్చుకున్నాడు. దీనితో సాయి పల్లవి పక్కన ధనుష్ కి బదులు డేవిడ్ డాన్స్ చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

click me!