శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ నుంచి క్రేజీ అప్డేట్.. ట్రైలర్ రిలీజ్ కు టైం ఫిక్స్..

By team teluguFirst Published Aug 31, 2022, 12:06 PM IST
Highlights

టాలీవుడ్ హీరో శర్వానంద్ (Shrwanand), అక్కినేని అమలా  నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను షురూ చేశారు. తాజాగా చిత్రం నుంచి క్రేజీ  అప్డేట్ వచ్చింది.
 

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka jeevitham). అమల అక్కినేని కీలక పాత్ర పోషిస్తుండగా, తెలుగు హీరోయిన్ రీతూ వర్మ శర్వా సరసన నటిస్తోంది. అయితే ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. గతేడాది నవంబర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సమయంలో భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో ఏకంగా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. 

ఈ సందర్భంగా లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ అందించారు. ఇప్పటికే అదిరిపోయే అప్డేట్స్ రాగా.. తాజాగా ట్రైలర్ ను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2న  మధ్యాహ్నం 12.30 గంటలకు ట్రైలర్  ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ అప్డేట్ ను అందించారు. ఈ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో శర్వా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా శర్వానంద్ సినిమాలు తీస్తుండటంతో ‘ఒకే ఒక జీవితం’ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

శర్వానంద్ - రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్ బ్యానర్ పై ఎస్‌. ఆర్‌ ప్రభు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీకి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. జేక్స్ బీజోయ్ అద్భుతమైన సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ భాగ‌మ‌య్యారు. సై - ఫై ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం  సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే చివరిగా వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలివ్వకపోవడంతో.. ఈ సినిమాతోనైనా శర్వాకు కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharwanand (@imsharwanand)

click me!