పెళ్లైన బాలీవుడ్ నటితో తెలుగు హీరో హర్షవర్ధన్ డేటింగ్..? వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత..?

Published : Jul 14, 2023, 07:44 PM IST
పెళ్లైన బాలీవుడ్ నటితో  తెలుగు హీరో హర్షవర్ధన్ డేటింగ్..?  వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత..?

సారాంశం

బాలీవుడ్ నటితో.. ప్రముఖ తెలుగు హీరో డేటింగ్ చేస్తున్నాడట. బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో హైలెట్ అవుతున్న ఈన్యూస్ లో నిజమెంత...?   

అచ్చ తెలుగు రాజమండ్రి కుర్రాడు  హర్షవర్ధన్ రానే.. బాలీవుడ్ హీరోలను మించి హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరోను మన  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించలేకపోయింది. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా.. అవి అతనికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. హీరో మెటీరియల్ అని నిరూపించుకున్న హార్షను మనతెలుగు  దర్శకులు  పెద్దగా పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ వెళ్లి ప్రయత్నించాడు. మన టాలీవుడ్ పట్టించుకోకపోయినా.. బాదలీవుడ్ లో మాత్రం బాగా  క్లిక్ అయ్యాడు హర్షవర్ధన్. వరుస అవకాశాలు అతని గుమ్మం ముందు నిలుచున్నాయి.  

దీంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లో ప్లే బాయ్ ఇమేజ్ కూడా సాధించాడు హర్ష. అంతేకాదు బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో డేటింగ్స్ చేస్తూ.. చాలా కథలు నడిపించాడు హర్ష.  లేడీ యాక్టర్స్ తో కూడా డేటింగ్ లు చేసి పాపులర్ అయ్యాడు.  హర్ష లిస్ట్ లో..కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో పాటు మరికొందరితో హర్ష వర్ధన్  ప్రేమాయణం నడిపించాడు.. అంతే కాదు అంతే స్పీడ్ గా  విడిపోయాడు కూడా. తాజాగా హర్షవర్ధన్ కు సబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం హర్షవర్ధన్  పెళ్లయిన భామతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి సంజీదా షేక్ తో హర్షవర్ధన్ డేటింగ్ లో ఉన్నాడు అంటూ గత కొంత కాలంగా బి-టౌన్ లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ అలీని వివాహం చేసుకున్న సంజీదా షేక్.. 2021లో విడాకులు తీసుకోని విడిపోయింది. అమీర్ అలీతో ఒక పాపకి కూడా జన్మనించింది సంజీదా. హర్ష అండ్ సంజీదా కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఇక ఇటీవల హర్ష తన సోషల్ మీడియాలో కొన్ని వెకేషన్ ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలు సంజీదా షేర్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ మ్యాచ్ అవ్వడంతో నెటిజెన్స్ ఆ ఫోటోలను ట్రెండ్ చేశారు. తాజాగా ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో హర్షని ప్రశ్నించగా జవాబు ఇచ్చాడు. ఆ వార్తలు తనని ఇబ్బంది కలిగించవని చెప్పుకొచ్చాడు. జర్నలిస్టుల పని రాయడం. వారికి వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. అవి రీచ్ అవ్వడానికి వారు అనేక కథనాలు రాస్తారు. వాటితో నాకు అసలు ఇబ్బంది లేదు అంటూ వెల్లడించాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?