Mahesh-Rajamouli: క్రేజీ బజ్.... మహేష్ తో సాహసాలు చేయించనున్న రాజమౌళి!

Published : Feb 07, 2022, 02:04 PM ISTUpdated : Feb 07, 2022, 02:06 PM IST
Mahesh-Rajamouli: క్రేజీ బజ్.... మహేష్ తో సాహసాలు చేయించనున్న రాజమౌళి!

సారాంశం

ఒక ప్రక్క ఆర్ ఆర్ ఆర్ విడుదల పనులు చూసుకుంటూనే మహేష్ కోసం కథను సిద్ధం చేయిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన తదుపరి చిత్రం మహేష్ చేస్తుండగా .. ఈ చిత్ర కథను రాసే బాధ్యత తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ఇచ్చారు.   

తమ అభిమాన హీరో రాజమౌళి (Rajamoui)దర్శకత్వంలో నటించాలని ప్రతి ఫ్యాన్ కోరుకుంటాడు. ఆయనతో మూవీ అంటే రికార్డుల మోతే. రాజమౌళి చిత్రంతో సదరు హీరో పాత రికార్డులన్నీ బ్రేక్ కావడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీ రికార్డ్స్ నమోదవుతాయి. బాహుబలి మూవీతో ప్రభాస్ ఇమేజ్  ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు రాజామౌళి. ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయనతో చిత్రం అంటే కనీసం ఐదు వందల కోట్ల బడ్జెట్ కావాలి. 

ఇక చేసిన హీరోతో రెండు మూడు సినిమాలు చేసిన రాజమౌళి కొందరు టాప్ స్టార్స్  తో కనీసం ఒక్క చిత్రం కూడా  చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ తో కలిపి ఎన్టీఆర్ తో అత్యధికంగా 4 సినిమాలు చేసిన ఆయన, ప్రభాస్ తో మూడు రామ్ చరణ్ తో రెండు చిత్రాలు చేశారు. పవన్, మహేష్,  అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ కి మూవీ చేసే అవకాశం రాలేదు. ఎట్టకేలకు మహేష్ కి ఆ ఛాన్స్ దక్కింది. 

నిజానికి మహేష్ (Mahesh)-రాజమౌళి ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ఆనుకొని కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేష్ తో అధికారికమే. ఈ  నేపథ్యంలో మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారనే  ఆసక్తి కొనసాగుతుంది. దీనిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా... మరో వ్ వార్త  తెరపైకొచ్చింది. 

మహేష్ మూవీ జంగిల్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా  రాజమౌళి తెరకెక్కించనున్నారట. ఈ వార్త చాలా కాలంగా చక్కర్లు కొడుతుండగా స్పష్టత లేదు. అయితే దాదాపు ఇదే బ్యాక్ డ్రాప్ ఖాయం ఆంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి అదే నిజమైతే మహేష్ కొండల్లో, కోనల్లో చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి అనడంతో సందేహం లేదు.  

మరోవైపు మహేష్ తన 28వ మూవీ దర్శకుడు ట్ త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఆయన  లేటెస్ట్ మూవీ సర్కారు వారి  పాట సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది . 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి