ఎన్టీఆర్, చరణ్ లను మారణాయుధాలుగా మారుస్తాడట

Published : Sep 18, 2020, 07:33 AM ISTUpdated : Sep 18, 2020, 07:36 AM IST
ఎన్టీఆర్, చరణ్ లను మారణాయుధాలుగా మారుస్తాడట

సారాంశం

రాజమౌళి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. అనివార్య కారణాల చేత ఈ మూవీ విడుదల వాయిదాపడుతూ వస్తుంది. ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరిల కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్ పాత్ర పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి యూనిట్ సిద్ధం అవుతుంది. దసరా తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభించాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నారట. దాదాపు 30శాతం వరకు షూటింగ్ పూర్తి చేయాల్సివుండగా, రాజమౌళి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8 ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా ప్రకటించినప్పటికీ అది జరగని పని అర్థం అవుతుంది. షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి చాలా సమయం పడుతుంది. 

ఎన్టీఆర్, చరణ్ లను రాజమౌళి ఒకప్పటి ఉద్యమ వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులుగా చూపించనున్నారు. చారిత్రక పాత్రలకు రాజమౌళి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కథలో కీలకమైన ఓ పాత్ర కోసం అజయ్ దేవ్ గణ్ ని తీసుకోవడం జరిగింది. కాగా ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవ్ గణ్ పాత్రపై ఇప్పటికే అనేక ఊహాగానాలు బయటికి రావడం జరిగింది. 

తాజాగా అజయ్ దేవ్ గణ్ పాత్రకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ప్రచారం అవుతుంది. వ్యవస్థపై, వ్యక్తులపై కోపంతో నిస్సహాయులుగా భీమ్,అల్లూరి ఊరిని వదిలివెళ్ళిపోతారు. ఆసమయంలో వీరిద్దరూ అజయ్ దేవ్ గణ్ ని కలుస్తారట. వీరి ఆవేశాన్నిఆయుధంగా మలిచే యోధుడైన గురువుగా అజయ్ దేవ్ గణ్ పాత్ర ఉంటుందట. శత్రువులపై పోరాడడానికి అవసరమైన యుద్ధ విద్యలలో వీరికి అజయ్ దేవ్ గణ్ శిక్షణ ఇస్తారట. ఇందుకోసం వారిద్దరి చేత అజయ్ దేవ్ గణ్ చేయించే సాహసాలు అబ్బురపరుస్తాయని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?