నిర్మాత చేసిన త(అ)ప్పులకు రవితేజ బలవుతున్నాడా?..`క్రాక్‌` వాయిదా.. అసలేం జరిగిందంటే?

By Aithagoni Raju  |  First Published Jan 9, 2021, 2:53 PM IST

కొత్త ఏడాదిలో థియేటర్లు ఈ సినిమాతో తిరిగి పుంజుకోబోతున్నాయి. సినిమాల సందడి మొదలు కానుందని అంతా భావించారు. `క్రాక్‌` చిత్రానికి హీరోలు అభినందనలు తెలియజేశారు. పైగా ఈ సినిమా బిజినెస్‌ కూడా భారీగానే జరిగిందట. దాదాపు రూ.40కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంటే అది మామూలు విషయం కాదు. దీంతో సినిమాపై హైప్‌ పెరిగింది. 


మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఫుల్‌ లెన్త్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ `క్రాక్‌`. హిట్‌ కాంబినేషన్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కొత్త ఏడాదిలో విడుదల కాబోతున్న తొలి సినిమా అని చెప్పొచ్చు. పైగా సంక్రాంతి వంటి పెద్ద పండుగ సందర్భంగా దీన్ని విడుదల చేయబోతున్నారు. `క్రాక్‌` చిత్రంతో ముందస్తుగా టాలీవుడ్‌కి పండుగని తీసుకురావాలని చిత్ర బృందం భావించింది. అందులో భాగంగా ఈ సినిమాని నేడు(జనవరి 9)న విడుదల చేయాలని నిర్ణయించారు. 

కొత్త ఏడాదిలో థియేటర్లు ఈ సినిమాతో తిరిగి పుంజుకోబోతున్నాయి. సినిమాల సందడి మొదలు కానుందని అంతా భావించారు. `క్రాక్‌` చిత్రానికి హీరోలు అభినందనలు తెలియజేశారు. పైగా ఈ సినిమా బిజినెస్‌ కూడా భారీగానే జరిగిందట. దాదాపు రూ.40కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందంటే అది మామూలు విషయం కాదు. దీంతో సినిమాపై హైప్‌ పెరిగింది. మరోవైపు  ఈ సినిమా రిజల్ట్ తో,  ఆడియెన్స్ రెస్పాన్స్ తో మిగిలిన సినిమాలు రిలీజ్‌ డేట్‌లో ప్రకటించే ఛాన్స్ ఉంది. కానీ ఉన్నట్టుండి పెద్ద షాక్‌ ఇచ్చింది `క్రాక్‌`. సినిమా విడుదల ఆగిపోయింది. మార్నింగ్‌ షో క్యాన్సిల్‌ అన్నారు. ఆ తర్వాత ఈరోజు మొత్తం షోస్‌ పడటం లేదు. మరి `క్రాక్‌` వాయిదాకి కారణమేంటనేది చూస్తే, పలు షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. 

Latest Videos

ఈ సినిమాకి నిర్మాత ఠాగూర్‌ మధు. ఆయన నిర్మించిన గత చిత్రాలు `అయోగ్య`, `అర్జున్‌ సురవరం` చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారట. ఆ సినిమాల టైమ్‌లో లాస్‌ వస్తే తాను భరిస్తానని నిర్మాత ఠాగూర్‌ మధు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఇప్పటికే చెల్లించకపోవడంతో విడుదల టైమ్‌లో వారంతా కోర్ట్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. విడుదలని వాయిదా వేయించారని తెలుస్తుంది. దీంతోపాటు ఈ సినిమా కోసం చేసిన అప్పులు కూడా వెంటాడాయని టాక్‌. అందులో భాగంగానే శనివారం విడుదల కావాల్సిన `క్రాక్‌` ఆగిపోయిందంటున్నారు. శనివారం బుకింగ్‌కి సంబంధించి అన్నీ రిఫండ్‌ చేస్తున్నారు. 

నిర్మాత చేసిన అప్పులకు ఇప్పుడు రవితేజ బలవుతున్నారు. రవితేజ ఇటీవల నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. వరుసగా నాలుగు సినిమాలు పోయాయి. దీంతో గోపీచంద్‌ మలినేని వంటి హిట్‌ కాంబినేషన్‌ కావడంతో ఈసినిమాతో హిట్‌ కొట్టాలని, కొడతారని భావించారు. కానీ ఇంతలోనే అసలుకే మోసం వచ్చింది. సినిమాపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ కలుగుతుంది. ఇది పరోక్షంగా హీరో రవితేజ మార్కెట్‌పై ప్రభావం పడుతుంది. అంతిమంగా రవితేజ బలయ్యే ఛాన్స్ ఉందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మొత్తానికి సంక్రాంతి కానుకగా మంచి వినోదాన్ని పొందాలను చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్న సినీ అభిమానులకు కొత్త సంవత్సరం ఆదిలోనే అడ్డంకి ఏర్పడటం బాధాకరం. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి ఈ సమస్యని సాల్వ్ చేసుకుని రేపైనా(ఆదివారం) సినిమాని విడుదల చేస్తారా. ఇంకా వాయిదా పడుతుందా? అన్నది చూడాలి.

click me!