పెళ్లి కొడుకుగా నాని, సిక్స్ ప్యాక్ లో సందీప్ అదరగొడుతున్న యంగ్ హీరోల లుక్స్!

Published : Jan 09, 2021, 11:54 AM IST
పెళ్లి కొడుకుగా నాని, సిక్స్ ప్యాక్ లో సందీప్ అదరగొడుతున్న యంగ్ హీరోల లుక్స్!

సారాంశం

కాళ్ళకు పారాణితో పంచ కట్టులో ఉన్న నాని చుట్టూ బంధువులు అందరూ చేరి, పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఇంటిల్లిపాది ఓచోట చేరి ఉన్న పండగలాంటి పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు.   

సంక్రాంతి పండగ అంటేనే కొత్త సినిమాల సందడి అని చెప్పాలి. కొత్త సినిమాల విడుదలతో పాటు అప్డేట్స్  తో సినీ ప్రియులకు నిజమైన పండగ వాతావరణం సంక్రాంతి వేళ చూడవచ్చు. కాగా ఇద్దరు యంగ్ హీరోలు నేడు ఆసక్తికర పోస్టర్స్ తో మనముందు వచ్చారు. సంక్రాంతి బెస్ట్ విషెష్ తెలియజేస్తూ ఆకట్టుకొనే లుక్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. సంక్రాంతి సందర్భంగా నేడు టక్ జగదీష్ మూవీ నుండి నాని సెకండ్ లుక్ విడుదల చేశారు. 

కాళ్ళకు పారాణితో పంచ కట్టులో ఉన్న నాని చుట్టూ బంధువులు అందరూ చేరి, పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఇంటిల్లిపాది ఓచోట చేరి ఉన్న పండగలాంటి పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. 

అలాగే మరో యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఏ వన్ ఎక్స్ ప్రెస్. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్ కేక పుట్టించేదిగా ఉంది. ఆటలో విజయాన్ని జెర్సీ తీసేసి జరుపుకుంటున్నట్లు సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా విడుదలకు సిద్ధంగా ఉంది. 
 
PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది