కొండా మూవీ డైరెక్టర్ వర్మకు కొండా సురేఖ ఘనస్వాగతం

By team teluguFirst Published Oct 12, 2021, 2:52 PM IST
Highlights

వరంగల్ ప్రాంతానికి చెందిన దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హనుమకొండలో జరుపుకుంటుంది. 

తెలంగాణా రక్త చరిత్ర అంటూ రామ్ గోపాల్ వర్మ కొండా టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ ప్రాంతానికి చెందిన దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హనుమకొండలో జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్వాగతం పలికారు. 


కొండా సురేఖ అనుచరులతో వరంగల్ లో ఆర్జీవీ ర్యాలీ చేశారు. తమ బయోపిక్ తెరకెక్కిస్తున్న ఆర్జీవీని ఈ రేంజ్ లో కొండా దంపతులు గౌరవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఒక వర్గం కొండా చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ సినిమాలలో ఎటువంటి సున్నిత అంశాలు ప్రస్తావిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


గతంలో ఆర్జీవీ అనంతపురం వేదికగా నడిచిన ఫ్యాక్షనిజం పై రక్త చరిత్ర పేరుతో రెండు చిత్రాలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు పరిటాల రవి, మద్దెల చెరువు సూరి మధ్య నడిచిన వర్గపోరు, మారణహోమం ఆ మూవీలో చూపించడం జరిగింది. సూర్య, వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్స్ ఆ సినిమాలో నటించడం విశేషం. ప్రస్తుతం అదే తరహాలో కొండా చిత్రాన్ని వర్మ తెరక్కిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ జరిపారు. 
 

click me!