తమ్మారెడ్డి 'మీ ఖర్మ' కామెంట్స్ పై ఓ రేంజిలో రచ్చ!

By Surya PrakashFirst Published Mar 9, 2020, 12:39 PM IST
Highlights

 ఇది దళితుల సినిమా అంటూ దానికి, దళితుల ఆదరణ కూడా లేదంటూ ఆయన అనటం విమర్శలకు తావిచ్చింది. ఆయన సినిమాని ఆయనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు.

రక్షిత్, నక్షత్ర జంటగా కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.  మొన్న శుక్రవారం రిలీజైన ఈ చిత్రం మంచి రివ్యూలే తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ మంచి బజ్ నే తెచ్చుకోగలిగింది. అయితేనేం సినిమాకు కలెక్షన్స్ లేవు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా విడుదలైంది. ఈ నేపధ్యంలో తన సినిమాకు కలెక్షన్స్ లేవనే ఆవేదనలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారాయి. ముఖ్యంగా ఇది దళితుల సినిమా అంటూ దానికి, దళితుల ఆదరణ కూడా లేదంటూ ఆయన అనటం విమర్శలకు తావిచ్చింది. ఆయన సినిమాని ఆయనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు.

ఇలా ఫలానా కులానికి, వర్గానికి సంభందించిన సినిమా అంటూ చెప్తే ...మిగతా కులాలు వాళ్లు చూడాల్సిన అవసరం ఏమటుందని అంటున్నారు. అయినా ఏ కులం వెళ్లి సినిమా చూస్తున్నారో ఈయనకు ఎలా తెలుసుని విమర్శలు చేస్తున్నారు. సినిమాలను ఫలానా కులం అంటూ విభజించటం తమ్మారెడ్డి వంటి సీనియర్ చెయ్యాల్సిన పని కాదని చెప్తున్నారు.  

చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ : ‘‘ఒక మంచి సినిమా కావాలి అంటారు.. మంచి రివ్యూ లు కావాలి అంటారు.. అవన్నీ ఉన్న సినిమా ‘పలాస 1978’. దళితుల పాత్రలు సినిమాల్లో ఉండవు.. దళిత కథలు సినిమాలుగా మారవు అంటారు.. కానీ పలాసలో వారి పాత్రలను హీరోలను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు కూడా మీరు చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే.. మరిన్ని సినిమాలు వస్తాయి.. ఇది నా వేదన. ఆవేదన..

నా నలభై ఏళ్ల కెరీర్‌లో ఏ సినిమా ఆడినా, ఆడకపోయినా బాధ పడలేదు.. కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం.. ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే. పలాస సినిమా విడుదలైన తరువాత అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన సినిమాల్లో పలాస ఒకటి.

ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది, మళ్లీ ఈ సినిమాను విడుదల రోజు థియేటర్‌లో చూశాను, నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. దీనంతటికి కారణం దర్శకుడు కరుణ కుమార్, తను ప్రాణం పెట్టి ఈ సినిమా తీసాడు, తన కష్టం వృధా కాదని భావిస్తున్నాను. నా 40 ఏళ్ల కెరీర్‌లో ఇంత బాగా ప్రతి డైలాగ్, సన్నివేశం నాకు గుర్తుండిపోయే సినిమా పలాస అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.  

click me!