అనసూయ సినిమాలో రాజమౌళిపై జోకులు.. వెన్నెల కిషోర్ వీడియో వైరల్!

Published : Jun 12, 2019, 02:25 PM IST
అనసూయ సినిమాలో రాజమౌళిపై జోకులు.. వెన్నెల కిషోర్ వీడియో వైరల్!

సారాంశం

టాలీవుడ్ లో అటు యాంకర్ గా, ఇటు నటిగా అనసూయ రాణిస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో అనసూయకు నటిగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో కథనం అనే చిత్రంలో నటిస్తోంది. 

టాలీవుడ్ లో అటు యాంకర్ గా, ఇటు నటిగా అనసూయ రాణిస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో అనసూయకు నటిగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో కథనం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకుడు. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెన్నెల కిషోర్, ధనరాజ్ హాస్యం పండించబోతున్నారు. 

ప్రస్తుతం కథనం చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ డబ్బింగ్ చెబుతున్న ఫన్నీ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిందిస్. ఈ వీడియోలో వెన్నెల కిషోర్ తనదైన శైలిలో జోకులు వేస్తూ నవ్విస్తున్నాడు. ముఖ్యంగా ' రాజమౌళికి బాహుబలి హిట్ ఎలా పడిందో తెలుసా' అంటూ వెన్నెల కిషోర్ వేస్తున్న ప్రశ్న ఆసక్తికరంగా ఉంది. దానికి సమాధానం కథనం సినిమాలోనే చూడాలి. 

కాలుతున్న దోసె మీద నెయ్యి వేసి రోస్ట్ చేస్తే.. కొడదాం.. గట్టిగా కొడదాం అంటూ వెన్నెల కిషోర్ చెబుతున్న డైలాగులు ఫన్నీగా ఉన్నాయి.పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. రోషన్ సాలూరు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి