ఇక్కడ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేదంటే...? కమెడియన్ ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By Mahesh JujjuriFirst Published Nov 23, 2022, 10:19 AM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీకి సబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి. ఇండస్ట్రీలో నిలబడాలంటే కొన్ని విషయాలు తెలియాలన్నారు.. మోహమాటానికి వెళ్తే.. అంతే సంగతులంటున్నారు ప్రియదర్శి. 


ఫిల్మ్ ఇండస్ట్రీకి సబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి. ఇండస్ట్రీలో నిలబడాలంటే కొన్ని విషయాలు తెలియాలన్నారు.. మోహమాటానికి వెళ్తే.. అంతే సంగతులంటున్నారు ప్రియదర్శి. 

టాలీవుడ్ లో కమెడియన్ గా తన కంటు ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు ప్రియదర్శి. తెలంగాణ యాస..పంచుల ప్రాసలతో ప్రియదర్శి తన మార్క్ ను టాలీవుడ్ లో నిలపుకున్నాడు.  నటుడిగా మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. చిన్న చిన్న పాత్రలలో మెరిపిస్తూ.. స్టార్ కమెడియన్ స్థాయికి వచ్చాడు ప్రియదర్శి.  పెళ్లి చూపులు సినిమాతో  ప్రియదర్శి పరిచయం అయ్యి... ఈ సినిమాతో వరుస అవకాశాలు సాధించాడు. అంతే  కాదు... మల్లేశం, జాతిరత్నాలు లాంటి సినిమాలతో  ప్రియదర్శి ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రియదర్శి.. రీసెంట్ గా రాహుల్ రామకృష్ణతో కలిసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో సందడి చేశారు ప్రియదర్శి. తన కెరీర్ కు సబంధించిన చాలా విషయాలు శేర్ చేసుకున్న ప్రియదర్శి... ఫిల్మ్ ఇండస్ట్రీ గురించిన చాలా విషయాలు గురించి మాట్లాడారు.  ఇండస్ట్రీలో నిలబడాలంట ఏం  చేయాలో చెప్పుకొచ్చాడు ప్రియదర్శీ. 

"ఇంతవరకూ కూడా నాకు తగిన పాత్రలనే చేస్తూ వచ్చాను. నాకు నచ్చకపోతే సున్నితంగానే 'నో' చెప్పేస్తాను. అయితే 'నో' చెప్పడం కూడా పెద్ద కళనే. ఎందుకంటే తలపొగరు అనేసి ప్రచారం చేస్తారు. ఈయన పెద్ద ఆర్టిస్టు .. ఈయనకి నచ్చాలట .. నిన్నగాక మొన్నొచ్చాడు అంటూ ఏదేదో అనేసుకుంటారు. 

అందువలన ఇక్కడ నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేదంటే చాలా జరిగిపోతాయి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే, మా మేనేజర్ రంగంలోకి దిగిపోయి, 'ఇప్పుడు కాదు లెండి .. మరోసారి చూద్దాం' అంటూ ఏదో మేనేజ్ చేసేస్తాడు. నటుడిగా కొంత గుర్తింపు వచ్చిన తరువాత కాస్త కోపాన్ని తగ్గించుకుని మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
 

click me!