#Chiranjeevi:సల్మాన్ ని ఆటో తోలమన్న చిరంజీవి, ఓకే అంటాడా?

By Surya PrakashFirst Published Dec 13, 2022, 8:08 AM IST
Highlights

మొదటి నుంచి చిరంజీవి, కుటుంబానికి,సల్మాన్ ఖాన్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది. దాంతో రీసెంట్ గా చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించారు.  

మొదటి నుంచి చిరంజీవి, కుటుంబానికి,సల్మాన్ ఖాన్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది. దాంతో రీసెంట్ గా చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి స్టార్స్ గురించజి ఓ హాట్ టాపిక్ బయిటకు వచ్చింది. అదేమిటంటే..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ (GodFather).ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణతో ఆర్‌.బి.చౌద‌రి, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. మలయాళ చిత్రం లూసిఫర్ (Lucifer) చిత్రానికి ఇది రీమేక్. సినిమా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో మెగాభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.  

చిరంజీవి కోరిక మేరకు 'గాడ్ ఫాదర్' (GodFather) సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదని చిరంజీవి   ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ సినిమా విజయంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) పాత్ర కూడా చాలా కీలకంగా ఉండటంతో, చిరు.. సల్మాన్‌కు ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు సల్మాన్ కు ఓ సలహా ఇచ్చారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే...

చిరంజివి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి...పూరి జగన్నాథ్ దగ్గర ఓ అద్బుతమైన కథ ఉందని చెప్పారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసిన ఆ కథ ఫెరపెక్ట్ గా సల్మాన్ కు సెట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. ఆ కథ మరేదో కాదు ఆటో జాని.  ఆ కథలో హీరో ఆటో నడుపుతూంటారు. ఇంటర్వెల్ దగ్గర నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా మారిపోతుంది. హీరో ఆటో నడపటం వెనక ఆసక్తికరమైన ప్లాష్ బ్యాక్ ఉంటుందని చెప్తున్నారు. ఆ కథ అయితే సల్మాన్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని...చెప్పారట.  మరి సల్మాన్ ఈ ప్రపోజల్ కు ఏమంటారో చూడాలి. ఎందుకంటే లైగర్ వంటి డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ గా పూరి ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడ్డారు.

click me!