చిరంజీవి `విశ్వంభర` సాంగ్‌ రచ్చ వేరే లెవల్‌.. `రామ రామ` పాటకి రికార్డు వ్యూస్‌

Aithagoni RajuPublished : May 13, 2025 9:50 PM
చిరంజీవి `విశ్వంభర` సాంగ్‌ రచ్చ వేరే లెవల్‌.. `రామ రామ` పాటకి రికార్డు వ్యూస్‌

సారాంశం

Vishwambhara Song: చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. సీజీ వర్క్ కారణంగా ఈమూవీ వాయిదా పడుతుంది. కానీ ఈ మూవీ విషయంలో ఒకటి మాత్రం అభిమానులను ఎంగేజ్‌ చేస్తుంది.  

Vishwambhara Song: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే సీజీ వర్క్ విషయంలో డిలే అవుతుందని తెలుస్తుంది. అందుకే రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు.

ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ వీఎఫ్‌ ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. వీఎఫ్‌ఎక్స్ ఔట్‌పుట్‌ బెస్ట్ గా వచ్చిన తర్వాతనే సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించాలని టీమ్‌ భావిస్తుంది.

శ్రోతలని ఉర్రూతలూగిస్తున్న `విశ్వంభర` సాంగ్‌

ఈ నేపథ్యంలో ఇప్పుడు `విశ్వంభర` సినిమాకి సంబంధించిన అప్‌ డేట్‌ మెగాస్టార్‌ ఫ్యాన్స్ ని హ్యాపీ చేస్తుంది. ఈ మూవీలోని `రామరామ` సాంగ్‌ సృష్టిస్తున్న సంచలనాలు అంతా ఇంతా కాదు. శ్రీరామనవమి పండుగని పురస్కరించుకుని ఈ పాటని విడుదల చేశారు

`రామ రామ` అంటూ సాగే ఈ సాంగ్‌ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. భక్తి పాటగా అలరిస్తుంది. దీంతో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కీరవాణి సంగీతం స్వరపరిచిన ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, శంకర్‌ మహదేవన్‌, ఐరా ఉడుపి, లిప్సిక భాష్యం ఆలపించారు. 

విశ్వంభర రామ రామ పాటకి రికార్డు వ్యూస్‌

ఈ పాట తాజాగా 25 మిలియన్స్ వ్యూస్‌ని దాటింది. అంటే రెండున్నర కోట్ల మంది ఈ పాటని వీక్షించడం విశేషం. ఈ పాటతోపాటు చిరంజీవి డాన్స్ లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. చిరంజీవి సినిమా పాటల్లో ఇది రికార్డు అనే చెప్పాలి.

అయితే మ్యూజిక్‌ పరంగా టాప్‌లో అల్లు అర్జున్‌ సినిమా పాటలున్నాయి. `పుష్ప` పాటలు వందల మిలియన్స్ వ్యూస్‌లో ఉన్నాయి, మరి చిరు బన్నీని టార్గెట్‌ చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది. 

సోషియో ఫాంటసగా రూపొందుతున్న `విశ్వంభర` చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్. 

PREV
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!