'సైరా' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

Published : Sep 12, 2019, 12:06 PM ISTUpdated : Sep 12, 2019, 02:13 PM IST
'సైరా' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు.   

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెత్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. తాజాగా చిత్రయూనిట్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాట్రైలర్‌ను ఈ నెల 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని కర్నూలులో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో కర్నూలు నుంచి హైదరాబాద్ గచ్చి బౌలి ఇండోర్ స్టేడియం కు వెన్యూ మార్చారు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు,  విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌