మనవరాళ్ళ కోసం కేఎఫ్‌సీ చికెన్‌ రెడీ చేసిన మెగాస్టార్‌.. వీడియో వైరల్‌

Published : Nov 01, 2020, 08:43 PM ISTUpdated : Nov 01, 2020, 10:43 PM IST
మనవరాళ్ళ కోసం కేఎఫ్‌సీ చికెన్‌ రెడీ చేసిన మెగాస్టార్‌.. వీడియో వైరల్‌

సారాంశం

తాజాగా తన మనవరాళ్ల కోసం మరో స్పెషల్‌ రెడీ చేశారు. ఈ ఆదివారం మనవరాళ్ళు సంహిత, నివ్రితిల కోసం కె.ఎఫ్‌.సి చికెన్‌ రెడీ చేశారు. ఆదివారం ఉదయం తన మనవరాళ్లతో కలిసి కె.ఎఫ్‌.సి చికెన్‌ చేస్తున్నట్టు ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు చిరు.

చిరంజీవి సోషల్‌ మీడియాలోకి ఎంటరైనప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచూ తనకి సంబంధించిన కొత్త విషయాలను షేర్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మెగాస్టార్‌ కుక్కర్‌గా మారిపోతున్నారు. సరదాగా కుక్కింగ్‌ చేస్తూ తన ఫ్యామిలీతోపాటు అభిమానులను అలరిస్తున్నారు. లాక్‌ డౌన్‌ టైమ్‌లో దోశ వేసి అమ్మకి తినిపించాడు. ఆ తర్వాత మధ్యలో వాళ్ళమ్మ కోసం స్పెషల్‌గా ఫిష్‌, చింతకాయ ఫ్రై చేసి వాళ్ళమ్మ అంజనీదేవితో వాహ్‌ అనిపించాడు. 

తాజాగా తన మనవరాళ్ల కోసం మరో స్పెషల్‌ రెడీ చేశారు. ఈ ఆదివారం మనవరాళ్ళు సంహిత, నివ్రితిల కోసం కె.ఎఫ్‌.సి చికెన్‌ రెడీ చేశారు. ఆదివారం ఉదయం తన మనవరాళ్లతో కలిసి కె.ఎఫ్‌.సి చికెన్‌ చేస్తున్నట్టు ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు చిరు. `రేపటి తరం అభిరుచికి నచ్చేటట్లు, రుచిగా ఏమన్నా చేయగలిగితే ఆ కిక్కే వేరప్పా` అంటూ ఈ వీడియో షేర్‌ చేశారు. 

ఇందులో నివ్రితి, సంహితలు బోర్‌ కొడుతుందని, కెఎఫ్‌సి చికెన్‌ తినాలని ఉందని సంహిత అనగా.. బయట పరిస్థితులేమీ బాగోలేదు.. ఇంట్లోనే రెడీ చేసుకుందామని చిరు అన్నారు. ఇంట్లో.. కె.ఎఫ్‌.సి చికెన్‌ ఎవరు రెడీ చేస్తారనగానే చిరు నేను చేస్తా అన్నాడు. అనడమే ఆలస్యం.  మీరు నాకు అసిస్టెంట్స్‌గా సహాయం చేస్తే.. అనగా.. ఇద్దరు మనవరాళ్లు.. నవ్వుకుంటూ.. కెఎఫ్‌సి చికెన్‌ తయారీకి కావాల్సిన వన్నీ రెడీ చేసి.. చిరుతో చేయించారు. ఫైనల్‌గా అద్భుతంగా ఉందంటూ.. మనవరాళ్లు కెఎఫ్‌సి చికెన్‌ను తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?