చిరంజీవి ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండేదేంటి?.. బాగా కవర్‌ చేసుకుంటున్నాడుగా?

Published : Dec 20, 2020, 02:01 PM ISTUpdated : Dec 20, 2020, 02:03 PM IST
చిరంజీవి ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండేదేంటి?.. బాగా కవర్‌ చేసుకుంటున్నాడుగా?

సారాంశం

సమంత నిర్వహించే `సామ్‌జామ్‌` టాక్‌ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు  ఆహా` నిర్వహకులు.

చిరంజీవి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో కనిపించబోతున్నారు. సమంత నిర్వహించే `సామ్‌జామ్‌` టాక్‌ షోలో చిరంజీవి పాల్గొన్నారు. ఇలాంటి షోలో పాల్గొనడం చిరంజీవికి మొదటిసారి కావడం విశేషం. అయితే ఇందులో చిరు ఏం చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు  ఆహా` నిర్వహకులు. ఇందులో సమంత, చిరు మధ్య ఓ కన్వర్జేషన్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఇందులో సమంత `మీ ఫ్రిజ్‌లో రెగ్యులర్‌గా ఉండే ఒక ఐటెమ్‌ ఏంటి` అని అడగ్గా.. చిరు ఇలా తీసి గ్లాస్‌లో వేసి తాగినట్టుగా చేయి సైగలతో చెప్పారు. దీంతో సమంతతోపాటు అక్కడికి వచ్చిన ప్రేక్షకులంతా బాగా పగలబడి నవ్వారు. అది మందు అని అంతా భావించారు. అయితే దీన్ని కవర్‌ చేసేందుకు చిరు మీరనేది కాదు.. మీరనుకునేది కాదంటూ దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్‌ అవుతుంది. ఈ నెల 25న క్రిస్మస్‌ కానుకగా ఈ చిరంజీవి ఎపిసోడ్‌ టాక్‌ షో ప్రసారం కానుంది. 

చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు నెక్ట్స్ సినిమాగా `లూసీఫర్‌` రీమేక్ ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్‌రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?