మెగాస్టార్‌, నయనతార, అనిల్‌ రావిపూడి ర్యాంపేజ్‌ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్‌ చిరంజీవి రచ్చ

Published : May 23, 2025, 06:34 PM IST
chiranjeevi, nayanthara

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి, నయనతార కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సంక్రాంతి టార్గెట్‌గా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించారు. 

`గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్ పీక్‌లో ఉంది. అప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో టాలీవుడ్‌ని షేక్‌ చేశారు చిరు. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లు కళకళలాడాల్సిందే. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు పక్కా.

 థియేటర్లలో చిరంజీవి పాటలని రిపీటెడ్‌గా వేసుకుని డాన్సులు చేసేవారు ఆడియెన్స్. ఆ తర్వాత అలాంటి పరిస్థితులు తగ్గాయి. చిరంజీవి కూడా తన పంథా మార్చారు. సందేశాత్మక చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలతో కొత్త దారిలో వెళ్లారు. మధ్య మధ్యలో అలాంటి కమర్షియల్‌ మూవీస్‌ చేసినా ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి.

`మెగా157` రెగ్యూలర్‌ షూటింగ్‌ షురూ 

మళ్లీ చాలా ఏళ్ల తర్వాత `వాల్తేర్‌ వీరయ్య`లో మరోసారి వింటేజ్‌ చిరంజీవిని టచ్‌ చేశారు దర్శకుడు బాబీ. ఇప్పుడు పూర్తి స్థాయి వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. `సైరా` తర్వాత మరోసారి వీరిద్దరు జోడీగా చేస్తున్నారు. 

ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నేడు శుక్రవారం(మే 23) నుంచి సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే షూటింగ్‌ ప్రారంభించినట్టు టీమ్‌ వెల్లడించింది.

`మెగా157`లో వింటేజ్‌ చిరంజీవి రచ్చ 

అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్, చరిష్మాతో ఆడియెన్స్ ని అలరించేందుకు చిరంజీవి రెడీ అయ్యారని, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా `మెగా157`సినిమా రూపొందుతుందని, వీరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ఇదే అని టీమ్‌ తెలిపింది. 

`చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచే ఆయన్ని మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్‌ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు. అలాంటి పాత్రతో అనిల్‌ రావిపూడి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నార`ని తెలిపింది టీమ్‌.

చిరంజీవితోపాటు ముఖ్య తారాగణంపై అనిల్‌ రావిపూడి షూటింగ్‌

ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కాగా, మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవి పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. 

ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి ఎంతో క్యూరియాసిటీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉండటం విశేషం. ఇందులో నయనతార స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతుంది. ఇటీవల ఆమెపై తీసిన వీడియోకి విశేష స్పందన లభించింది. ఆమె హీరోయిన్‌గా నటించడం కూడా సినిమా మైలేజ్‌ని పెంచింది.

`మెగా 157` స్ట్రాంగ్‌ టెక్నీకల్‌ టీమ్‌

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్‌ రెడ్డి కెమెరామెన్‌ గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్‌ భావిస్తుంది. 

ఆ టార్గెట్‌తోనే నేడు షూటింగ్‌ ప్రారంభించింది టీమ్‌. అనిల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ చేసి సంచలనాలు క్రియేట్‌ చేసిన విసయం తెలిసిందే. మరి చిరంజీవితో చేస్తున్న ఈ సినిమాతో ఇంకా ఎలాంటి రికార్డులు బ్రేక్‌ చేస్తారో చూడాలి.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, రాజశేఖర్ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? మెగాస్టారే రిజెక్ట్ చేశాడా?
థ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ 'మార్గన్'..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్