చీకట్లో కూరుకుపోతున్న పరిశ్రమకి ఊతమిచ్చారుః చిరు‌, నాగ్‌, వెంకీ, చరణ్‌ థ్యాంక్స్

Published : Nov 23, 2020, 06:21 PM ISTUpdated : Nov 23, 2020, 07:37 PM IST
చీకట్లో కూరుకుపోతున్న పరిశ్రమకి ఊతమిచ్చారుః చిరు‌, నాగ్‌, వెంకీ, చరణ్‌ థ్యాంక్స్

సారాంశం

రేపటినుంచే థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌ వంటి వారు స్పందించి థ్యాంక్స్ చెప్పారు.

చిత్ర పరిశ్రమకి సీఎం కేసీఆర్‌ పలు వరాలు కురిపించారు. రేపటినుంచే థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రామ్‌చరణ్‌ వంటి వారు స్పందించి థ్యాంక్స్ చెప్పారు.

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఆయన చెబుతూ, `కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్ మెట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్ లో షోలను పెంచుకునేందుకు అనుమతివ్వడం. 

మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది` అని తెలిపారు చిరంజీవి. 

నాగార్జున స్పందిస్తూ, కోవిడ్‌ కారణంగా చీకట్లో కూరుకుపోయి ఉన్న చిత్ర పరిశ్రమకి ఇలాంటి అనిశ్చిత సమయాల్లో అవసరమైన సహాయక చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు` అని పేర్కొన్నారు. 

రామ్‌చరణ్‌ స్పందిస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తగిన  సహాయక చర్యలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు` అని చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?