విశాల్‌ తలపై పగిలిన సీసా.. కానీ కంటిన్యూగా షూటింగ్‌

Published : Jun 19, 2021, 01:42 PM IST
విశాల్‌ తలపై పగిలిన సీసా.. కానీ కంటిన్యూగా షూటింగ్‌

సారాంశం

హీరో విశాల్‌ తనకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్‌ని, ప్యాషన్‌ని చాటుకున్నారు. తలకి బలంగా సీసా పగిలిపోయినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. 

హీరో విశాల్‌ తనకు సినిమా పట్ల ఉన్న డెడికేషన్‌ని, ప్యాషన్‌ని చాటుకున్నారు. తలకి బలంగా సీసా పగిలిపోయినా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొని అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన `నాట్‌ ఏ కామన్‌ మేన్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. తు పా శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రషూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. 

ఇందులో భాగంగా ఫైట్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విలన్‌ పాత్రధారులు విశాల్‌ని ఖాళీ సీసాలతో కొడుతుంటారు. అందులో భాగంగా విశాల్‌ తలకి వెనక భాగంలో బలంగా సీసా తగులుతుంది. సీసా పగిలి గాయమైనా లెక్క చేయకుండా ఆ ఫైట్‌ సీక్వెన్స్ ని పూర్తి చేశాడు విశాల్‌. అయితే ఇలాంటి సాహసోపేతమైన ఫైట్‌ సీన్స్ ని డూప్‌తో చేయిస్తుంటారు. కానీ డూప్‌ లేకుండా స్వతహాగా విశాల్‌ ఈ ఫైట్‌ చేయడం విశేషం. పైగా తలకు గాయమైనా పట్టించుకోకుండా ఫైట్‌ సీక్వెన్స్ ని పూర్తి చేశారు. 

అయితే విశాల్‌ తలకి సీసా తగిలి పగిలిపోయినా పెద్దగా గాయాలు కాకపోవడంతో యూనిట్‌ అంతా ఊపిరి పీల్చుకుంది. ఇంత జరిగినా విశాల్‌ ఎలాంటి బ్రేక్‌ లేకుండా షూటింగ్‌లో పాల్గొనడం అందరిని ఆకట్టుకుంటుంది. దీనిపై విశాల్‌ స్పందించారు. `ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నా. ఆ ఫైటర్‌ తప్పేమీ లేదు. టైమింగ్‌ మిస్‌ అయ్యింది. అయినా యాక్షన్‌ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్‌ కంటిన్యూ చేశాం. యాక్షన్‌ సీక్వెన్స్‌ ని అద్భుతంగా తెరకెక్కించిన ఫైట్‌ మాస్టర్‌ రవివర్మకి ధన్యవాదాలు` అని  ఫైట్‌ సీన్స్‌కు సంబంధించిన వీడియోను విశాల్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. విశాల్‌31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?